
సుహ్ల్ (జర్మనీ): ఇండియా షూటర్ రైజా దిల్లాన్.. ఐఎస్‌ఎస్‌ఎఫ్ జూనియర్ వరల్డ్ కప్‌లో సిల్వర్ మెడల్‌తో మెరిసింది. గురువారం జరిగిన విమెన్స్ స్కీట్ ఫైనల్లో రైజా 51 పాయింట్లతో రెండో ప్లేస్‌లో నిలిచింది. ఫోబీ బోడ్లే స్కాట్ (బ్రిటన్) 53 పాయింట్లతో గోల్డ్ మెడల్ సాధించగా, అన్నాబెల్లా హెట్మెర్‌కు బ్రాంజ్ మెడల్ దక్కింది. రైజా కెరీర్‌లో ఏ లెవెలోనైనా ఇదే తొలి మెడల్ కావడం విశేషం. ఓవరాల్‌గా ఈ టోర్నీలో ఇండియా మూడో మెడల్‌ను ఖాతాలో వేసుకుంది. మూడు రౌండ్ల పాటు జరిగిన క్వాలిఫయింగ్‌లో రైజా 71 పాయింట్లు సాధించి రెండో ప్లేస్‌లో నిలిచింది.