థ్రిల్లింగ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో పవర్ ప్లే ట్రైలర్

థ్రిల్లింగ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో పవర్ ప్లే ట్రైలర్

యంగ్ హీరో రాజ్ తరుణ్ ‘పవర్ ప్లే’ సినిమా ట్రైలర్ బుధ‌వారం విడుద‌లైంది. విజయ్ కుమార్ కొండా ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్న ఈ సినిమాలో రాజ్ త‌రుణ్ తన ఇమేజ్ కి భిన్నంగా ప్ర‌య‌త్నించిన‌ట్లు తెలుస్తోంది. ట్రైల‌ర్ అంతా కూడా ఒక్క డైలాగ్ కూడా లేకుండా కేవలం బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఆస‌క్తి క‌లిగించేలా ఉంది. గ‌తంలో రాజ్- విజ‌య్ కాంబినేష‌న్ లో ‘ఒరేయ్ బుజ్జిగా’ చిత్రం వ‌చ్చింది.

తాజా చిత్రంలో థ్రిల్లింగ్ అండ్ క్రైమ్ ఎలిమెంట్స్ తో ఈ సినిమా రూపోందించారు. రాజ్ తరుణ్, హేమాల్ జంట‌గా న‌టిస్తున్న ఈ సినిమా కు నిర్మాత దేవేశ్‌. ట్రైల‌ర్‌లో క్రైమ్ సన్నివేశాలతో పాటు .. రాజ్ తరుణ్ లిప్ కిస్సులతో రెచ్చిపోవడం చూడవచ్చు. నటుడు అజయ్ తో పాటు, హీరోయిన్ పూర్ణ లు ఈ మూవీలో కీలక పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు.