
మునుగోడు నియోజకవర్గం చండూర్ లో ప్రచారం చేస్తున్న బీజేపీ అభ్యర్థి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డికి ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ ఎదురుపడ్డారు. రాజగోపాల్ రెడ్డిని కేఏ పాల్ ఆలింగనం చేసుకున్నారు. ఈ సమయంలో రాజగోపాల్ రెడ్డి అనుచరులు జై బీజేపీ అంటూ నినాదాలు చేశారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
నవంబర్ మూడున జరగనున్న మునుగోడు ఉపఎన్నికను అన్ని పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఓటర్లను ప్రసన్నం చేసుకునేందుకు జోరుగా ప్రచారాలు చేస్తున్నాయి. టీఆర్ఎస్ నుంచి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి, కాంగ్రెస్ నుంచి పాల్వాయి స్రవంతి, బీజేపీ నుంచి కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, టీజేఎస్ నుంచి పల్లె వినయ్ కుమార్, ప్రజాశాంతి పార్టీ నుంచి కేఏ పాల్ లు ఇప్పటికే నామినేషన్లు వేశారు. ఆరున ఫలితాలు వెలువడనున్నాయి.