సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

సమస్యల పరిష్కారానికే ప్రజావాణి : రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్

రాజన్న సిరిసిల్ల, వెలుగు: సమస్యల పరిష్కారానికే ప్రజావాణి నిర్వహిస్తున్నామని రాజన్న సిరిసిల్ల కలెక్టర్ గరిమా అగ్రవాల్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్‌‌లో ఆమె ప్రజావాణిలో ప్రజల నుంచి దరఖాస్తులు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజావాణికి సోమవారం 167 అర్జీలు వచ్చినట్లు చెప్పారు.

అర్జీలను శాఖలవారీగా జిల్లా అధికారులు పంపామని, వాటిని వెంటనే పరిష్కరించాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్  కలెక్టర్ నగేశ్‌‌, ఆర్డీవోలు వెంకటేశ్వర్లు, రాధాబాయ్, హౌసింగ్ పీడీ వెంకటమాధవరావు పాల్గొన్నారు.