
హామీలిచ్చి మోసం చేసిండు
పోలీస్‌స్టేషన్‌లో బీజేపీ నాయకుల ఫిర్యాదు
కంప్లైంట్ తీసుకోలేదని స్టేషన్ గోడకంటించి నిరసన
సిరిసిల్ల కలెక్టరేట్, వెలుగు: ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలను కేటీఆర్ మరిచారని, కేవలం ప్రారంభోత్సావాలకే పరిమితమయ్యారని బీజేపీ రాజన్న సిరిసిల్ల జిల్లా పట్టణ శాఖ అధ్యక్షుడు అన్నల్దాస్ వేణు ఆరోపించారు. బుధవారం ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఎన్నికల సమయంలో ఈ ప్రాంత ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి బాగోగులు చూస్తానని, హామీలు నెరవేరుస్తానని చెప్పారని అన్నారు. దొంగ హామీలతో ప్రజలను మోసం చేసిన మంత్రి కేటీఆర్‌పై చర్యలు తీసుకోవాలని పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేయడానికి వెళితే పోలీసులు పట్టించుకోలేదన్నారు. దాంతో ఫిర్యాదును స్టేషన్గోడకు అంటించి నిరసన వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నాయకులకు పోలీసులు తొత్తులుగా పని చేస్తున్నారని ఆరోపించారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి రేగుల మల్లికార్జున్, రెడ్డబోయన గోపి, కౌన్సిలరు గూడూరి భాస్కర్ తదితరులు పాల్గొన్నారు.