నాన్–కరోనా పేషెంట్స్ గురించి ఆలోచించట్లేదు

నాన్–కరోనా పేషెంట్స్ గురించి ఆలోచించట్లేదు

కేంద్రంపై సచిన్ పైలట్ విమర్శలు
న్యూఢిల్లీ: వలస కూలీల సమస్యలను పరిష్కరించడంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందని రాజస్థాన్ కాంగ్రెస్ చీఫ్, డిప్యూటీ సీఎం సచిన్ పైలట్ విమర్శించారు. ‘సవాళ్లను ఎదుర్కోవడానికి వనరులను పెంచడం కోసమే లాక్ డౌన్ ను పొడిగించారు. ఆ సమయాన్ని అంత బాగా యూజ్ చేయలేదు. ఆస్పత్రుల్లో బెడ్స్ ను విస్తరించడం, డాక్టర్స్ సంఖ్యను పెంచడం, మరిన్ని వెంటిలేరర్లను ఏర్పాటు చేయాల్సింది. కానీ టెస్టింగ్, ట్రీట్ మెంట్ కు కావాల్సినంతగా మనం అప్ గ్రేడ్ చేయలేదు. మనం నిజంగా కరోనా రాని (నాన్ కరోనా) పేషెంట్స్ గురించి ఆలోచించడం లేదు. లీడర్ షిప్ అంటే ముందే ఊహించడం. కానీ వలసలను ఊహించడంలో సర్కార్ విఫలమైంది. ఒకవేళ వాళ్లు ముందే ఊహించినట్లయితే వారు దానికి పరిష్కారాన్ని కనుగొనేవారు. మన దేశంలో ‘పాన్ ఇండియా లేబర్ మైగ్రంట్ పేమెంట్’ అనే విధానమే లేదు. పైస్థాయి నుంచి క్లారిటీ లేకపోతే అది కన్ఫ్యూజన్ ను క్రియేట్ చేస్తుంది. లాక్ డౌన్ కొనసాగింపునకు సంబంధించి కేంద్రం విస్తృత గైడ్ లైన్స్ ను జారీ చేయాలి. ఆ నిబంధనలను అమలు చేసే నిర్ణయాన్ని రాష్ట్రాలకు వదిలేయాలి’ అని సచిన్ పైలట్ చెప్పారు.