మంత్రికి సన్మానం జరుగుతుండగా.. స్టేజీ కూలింది

మంత్రికి సన్మానం జరుగుతుండగా.. స్టేజీ కూలింది

రాజస్థాన్ ప్రభుత్వంలో కొత్తగా నియమితులైన బీజేపీ నేత, మంత్రి హీరాలాల్ నగర్ కోటాలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సమయంలో అకస్మాత్తుగా వేదిక కూలిపోవడంతో కింద పడిపడ్డారు. కోట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని మంత్రి సొంత జిల్లా సంగోడ్‌లో జరిగిన ఈ కార్యక్రమంలో వేదికపై మంత్రిని సన్మానిస్తున్నప్పుడు ఈ సంఘటన జరిగింది.

మంత్రి హీరాలాల్ నగర్‌కు స్వాగతం పలుకుతుండగా, జనం రద్దీతో నిండిపోవడంతో స్టేజీ ఒక్కసారిగా కుప్పకూలింది. వేదిక ఒక్కసారిగా కుప్పకూలిన ఘటనకు సంబంధించిన వీడియో కూడా వైరల్‌గా మారింది. మంత్రి సహా వేదికపై ఉన్నవారంతా ఒక్కసారిగా కిందపడిపోవడంతో ప్రజల్లోనూ, స్థానికంగానూ గందరగోళం నెలకొంది. ఈ ప్రమాదంలో గ్రామపెద్ద సహా ఐదుగురికి గాయాలు కాగా, వారిని ఆసుపత్రికి తరలించారు. అనంతరం మంత్రి నగర్‌ ఆస్పత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించారు.