ఐపీఎల్ 19లో భాగంగా శుక్రవారం (మే 1) ఢిల్లీ క్యాపిటల్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు తలపడేందుకు సిద్ధమయ్యాయి. జైపూర్‌లోని సాయివాయ్ మాన్‌సింగ్ స్టేడియం వేదికగా రాత్రి 7.30 గంటలకు ఈ పోరు ప్రారంభం కానుంది. ఈ మ్యాచులో టాస్ గెలిచిన రాజస్థాన్ కెప్టెన్ రియాన్ పరాగ్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ తొలుత బౌలింగ్ చేయనుంది. ఇరు జట్లు ప్లేయింగ్ లెవన్‌లో మార్పులు చేశాయి. గాయం కారణంగా టోర్నీకి దూరమైన డీసీ స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ ఈ సీజన్లో తొలి మ్యాచ్ ఆడనున్నాడు.
టోర్నీలో జైత్రయాత్ర సాగిస్తోన్న పంజాబ్‌ను చిత్తు చేసి రాజస్థాన్ ఫుల్ జోష్‌లో ఉండగా.. సొంత గడ్డపై ఆర్సీబీ చేతిలో దారుణ ఓటమి చవిచూసి ఢిల్లీ తీవ్ర నిరాశలో ఉంది. ఈ సీజన్లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడిన డీసీ మూడు విజయాలు, ఐదు ఓటములతో పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోంది. ఢిల్లీ ఫ్లే ఆఫ్స్‌కు చేరుకోవాలంటే రాజస్థాన్‌పై తప్పక నెగ్గాల్సిన పరిస్థితి.
దీంతో రాజస్థాన్‌పై ఎలాగైనా గెలిచి విజయాల బాట పట్టాలని డీసీ భావిస్తోంది. మరోవైపు.. ఈ సీజన్లో ఇప్పటి వరకు 9 మ్యాచులు ఆడిన రాజస్థాన్ 6 విజయాలు సాధించి మూడింట్లో ఓడింది. ప్రస్తుతం 12 పాయింట్లతో ప్లే ఆఫ్స్ చేరుకునేందుకు దగ్గరలో ఉంది. డీసీపై గెలిచి ఫ్లే ఆఫ్స్ రేసులో మరింత ముందుకు దూసుకెళ్లాలని భావిస్తోంది.
జట్లు:
ఢిల్లీ క్యాపిటల్స్ (ప్లేయింగ్ XI): KL రాహుల్(w), పాతుమ్ నిస్సాంక, నితీష్ రాణా, సమీర్ రిజ్వీ, ట్రిస్టన్ స్టబ్స్, అక్షర్ పటేల్(c), అశుతోష్ శర్మ, కైల్ జేమీసన్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, T నటరాజన్
రాజస్థాన్ రాయల్స్ (ప్లేయింగ్ XI): యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్(w), రియాన్ పరాగ్(c), డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, శుభమ్ దూబే, జోఫ్రా ఆర్చర్, రవి బిష్ణోయ్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ
