తెలంగాణ విమోచన దినోత్సవం.. సైనిక అమరవీరుల స్తూపానికి రాజ్ నాజ్ సింగ్ నివాళి

తెలంగాణ విమోచన దినోత్సవం.. సైనిక అమరవీరుల స్తూపానికి రాజ్ నాజ్ సింగ్ నివాళి

హైదరాబాద్: సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో సెప్టెంబర్ 17 సందర్భంగా.. తెలంగాణ విమోచన దినోత్సవం జరిగింది. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రక్షణ శాఖ మంత్రి రాజ్ నాథ్ సింగ్ హాజరయ్యారు. సైనిక అమరవీరుల స్తూపానికి నివాళులు అర్పించిన ఆయన.. అమరవీరుల త్యాగాలను గుర్తుచేసుకున్నారు. జాతీయ జెండాను ఆవిష్కరించారు. సర్దార్ వల్లభ భాయ్ పటేల్ విగ్రహానికి నివాళులు అర్పించారు. త్రివిధ దళాల గౌరవ వందనం స్వీకరించారు.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా తెలంగాణ స్వాతంత్ర్య సమర యోధులను సన్మానించనున్నారు. తెలంగాణ స్వాతంత్ర్య పోరాట యోధుల పోరాట గాథలు, ఉద్యమ కథలను వివరిస్తూ ఫొటో ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ను ఏర్పాటు చేశారు. ఈ ఫొటో ఎగ్జిబిషన్ను రాజ్ నాథ్ సింగ్ వీక్షించనున్నారు. పరేడ్ గ్రౌండ్ సమీపంలోని కంటోన్మెంట్ పార్కులో దివంగత మాజీ ప్రధానమంత్రి  అటల్ బిహారీ వాజ్‌‌‌‌‌‌‌‌పేయి విగ్రహాన్ని రాజ్ నాథ్ సింగ్ ఆవిష్కరించనున్నారు.

ఇదిలా ఉండగా.. సెప్టెంబర్ 17వ తేదీ.. తెలంగాణ రాజకీయాల్లో పొలిటికల్ హీట్ డే కూడానూ.. విమోచనమా.. విలీనమా అనే కాంట్రవర్సీ ఎన్నో ఏళ్లుగా నడుస్తూనే ఉంది. ఇలా.. సెప్టెంబర్ 17ను ఎవరికి నచ్చిన విధంగా వారు సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది.. సెప్టెంబర్ 17వ తేదీన ప్రజా పాలన దినోత్సవం నిర్వహించాలని కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయించింది.