పార్లమెంట్ లో మరో అధికారికి కరోనా పాజిటివ్

పార్లమెంట్ లో మరో అధికారికి కరోనా పాజిటివ్

రాజ్యసభ సెక్రటేరియట్‌కు చెందిన ఓ అధికారికి కరోనా సోకినట్లు నిర్ధారణ అయింది. దీంతో పార్లమెంటు భవనంలో ఆయన ఆఫీసు ఉన్న అంతస్తు మొత్తాన్ని మూసివేశారు. పార్లమెంటు కాంప్లెక్సు పరిధిలో నమోదైన నాలుగో కేసు ఇది. అధికారి భార్య, పిల్లలకు కూడా కొవిడ్ ఉన్నట్లు గుర్తించారు. అంతేకాదు ఇటీవల ఆయనను కలిసినవారు కూడా సెల్ఫ్ క్వారంటైన్ లో ఉండాలని డాక్టర్లు సూచించారు. ఆయన ఈ నెల 28 వరకు విధులకు హాజరైనట్లు తెలిపారు. వారం క్రితం లోక్‌సభకు చెందిన ఓ ఉన్నతాధికారికి వైరస్‌ సోకినట్లు నిర్ధారణ అయ్యింది. అంతకుముందు ఓ హౌజ్‌కీపర్‌కు, భద్రతా సిబ్బందికి కూడా వైరస్‌ బారిన పడ్డారు. దీంతో పరిసరాల్ని మొత్తం శానిటైజ్‌ చేశారు. లోపలికి వచ్చేవారికి తప్పనిసరిగా థర్మల్‌ స్క్రీనింగ్‌ నిర్వహిస్తున్నారు సెక్రటేరియట్ సిబ్బంది.