
లగ్జరీ కార్ మేకర్ ఆడి ఇండియా.. క్యూ3, క్యూ3 స్పోర్ట్బ్యాక్లకు బోల్డ్ ఎడిషన్ మోడల్స్ విడుదల చేసింది. క్యూ3 బోల్డ్ ఎడిషన్ ధర రూ. 54.65 లక్షలు (ఎక్స్-షోరూమ్) కాగా, క్యూ3 స్పోర్ట్‌బ్యాక్ బోల్డ్ ఎడిషన్ ధర రూ. 55.71 లక్షలు (ఎక్స్-షోరూమ్). రెండింటిలోనూ 2.0-లీటర్ టర్బో-పెట్రోల్ మోటార్ 190 బీహెచ్పీని, 320 ఎన్ఎం టార్క్‌ను ఇస్తుంది. ఆటోమేటిక్ ట్రాన్స్‌మిషన్ ఉంటుంది.