ధూంధాంగా ఫ్రెషర్స్ డే.. అంబేద్కర్ లా కాలేజీలో గ్రాండ్గా సెలబ్రేషన్స్ .

ధూంధాంగా ఫ్రెషర్స్ డే.. అంబేద్కర్ లా కాలేజీలో గ్రాండ్గా సెలబ్రేషన్స్  .

బాగ్ లింగంపల్లిలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీలో గురువారం ఫ్రెషర్స్ డే వేడుకలు గ్రాండ్​గా జరిగాయి. విద్యార్థులు కల్చరర్​ యాక్టివిటీస్​తో దుమ్ములేపారు. జానపదాల నృత్యాలు ధూంధాంగా సాగాయి. మరోవైపు సినిమా పాటలకు గ్రూప్​, సోలో డ్యాన్సులతో హోరెత్తించారు. సీనియర్స్​, జూనియర్స్​​ తేడా లేకుండా పార్టీలో విద్యార్థులంతా ఉత్సాహంగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నిర్వహించిన ర్యాంప్​ వాక్​ స్పెషల్​ అట్రాక్షన్​గా నిలిచింది. కాలేజీ సీఈవో ప్రొఫెసర్ లింబాద్రి, ప్రిన్సిపాల్ డాక్టర్ సృజన మాట్లాడుతూ.. విద్యార్థులంతా స్నేహభావంతో మెదగాలని సూచించారు.