రాజ్‌కోట్: విజయ్ హజారే ట్రోఫీలో హైదరాబాద్ ఐదో ఓటమిని మూటగట్టుకుంది. గురువారం జమ్మూ కాశ్మీర్‌తో జరిగిన గ్రూప్–బి ఎలైట్ మ్యాచ్‌లో 3 వికెట్ల తేడాతో ఓడింది. టాస్ ఓడిన హైదరాబాద్ 50 ఓవర్లలో 268/9 స్కోరు చేసింది. అమన్ రావు (60), రాహుల్ సింగ్ (56), నితేశ్ రెడ్డి (54 నాటౌట్) రాణించారు.
తర్వాత జమ్మూ కాశ్మీర్ 47.5 ఓవర్లలో 272/7 స్కోరు చేసి నెగ్గింది. అకీబ్ నబీ (114 నాటౌట్) కి వన్షజ్ శర్మ (69 నాటౌట్) అండగా నిలిచాడు. 90 రన్స్‌కే 7 వికెట్లు కోల్పోయిన జమ్మూను ఈ ఇద్దరు ఎనిమిదో వికెట్‌కు 182 రన్స్ జోడించి గెలిపించారు. అకిబ్ నబీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.
