హైదరాబాద్, వెలుగు: హైదరాబాద్ దుర్గం చెరువు ఆక్రమణల కేసును కొట్టివేయాలని కోరుతూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ విచారణ నుంచి జడ్జీ జస్టిస్ జూకంటి అనిల్‌కుమార్ తప్పుకున్నారు.
ఈ పిటిషన్‌ను మరో న్యాయమూర్తికి కేటాయించడానికిగాను ఫైలును చీఫ్ జస్టిస్ ముందుంచాలని రిజిస్ట్రీని ఆదేశించారు.దుర్గం చెరువులో 5 ఎకరాల భూమిని ఆక్రమించారంటూ హైడ్రా అధికారి ఆనంద్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు గతేడాది డిసెంబరు 31న మాదాపూర్ పోలీసులు కేసు నమోదు చేశారు.
