- వీకే సింగ్ ఇంటి ఆవరణలోకి వెళ్లి రచ్చ
- గత నెల 30న ఘటన.. ఆలస్యంగా ఫిర్యాదు
జూబ్లీహిల్స్, వెలుగు : ‘రోడ్డును బ్లాక్ చేసేందుకు అధికారం ఎవరిచ్చారు’ అంటూ ఓ యువకుడు మాజీ ఐపీఎస్ఆఫీసర్ఇంటి ఎదుట రచ్చ చేశాడు. ఇంట్లోకి వెళ్లి న్యూసెన్స్చేశాడు. దీంతో అతడిపై జూబ్లీహిల్స్పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల కథనం ప్రకారం.. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 7 ప్రశాసన్ నగర్ ప్లాట్ నంబర్ 49లో మాజీ ఐపీఎస్ ఆఫీసర్వీకే సింగ్ఉంటున్నారు.
వీకే సింగ్ ఇంటికి ఎదురుగా రోడ్డు నిర్మాణంలో ఉండగా కాంట్రాక్టర్బారికేడ్లు ఏర్పాటు చేశాడు. గత నెల 30న అర్ధరాత్రి ఒంటి గంటకు ఇదే ప్రాంతానికి చెందిన ఫ్లాట్ నంబర్ 40లో ఉండే తబ్రేజ్ అనే యువకుడు కారులో ఆ రూట్లో వెళ్తున్నాడు.
అక్కడ బారికేడ్లు పెట్టి ఉండడంతో రోడ్డును ఎందుకు బ్లాక్ చేశారంటూ గొడవకు దిగాడు. వీకే సింగ్ఇంటి మెయిన్ గేటును బలంగా కొట్టాడు. సెక్యూరిటీ జస్వంత్ కుమార్ గేటు తీయగా పార్కింగ్ ఏరియాలోకి ప్రవేశించి బూతులు తిట్టాడు. ఇది విన్న వీకే సింగ్బయటకు రాగా, ‘ఇప్పటికిప్పుడు 500 మందిని పిలిచి, ఇంటిని, వాహనాలను ధ్వంసం చేయిస్తా’ అని హెచ్చరించాడు. అయితే, ఘటన గత నెల 30న జరగ్గా, గురువారం జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో వీకే సింగ్సెక్యూరిటీ జస్వంత్ కుమార్ ఫిర్యాదు చేశారు. దీంతో కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.
