
జగిత్యాల, వెలుగు: జగిత్యాలలో ఓ యువకుడు స్థానిక పోలింగ్ కేంద్రంలో ఓటు వేసేటప్పుడు ఫొటో తీసి, సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం వైరల్‌గా మారింది. జిల్లా కేంద్రంలోని ఖిలా గడ్డకు చెందిన యువకుడు సంబంధిత బూత్‌లో నిజామాబాద్ బీజేపీ పార్టీ అభ్యర్థి అర్వింద్‌కు ఓటు వేశాడు. కమలం పువ్వు గుర్తు బటన్‌ను నొక్కడంతో వచ్చిన లైట్‌తో సహా ఫొటో తీసి ఫేస్ బుక్ లో పోస్ట్ చేశాడు. పోలింగ్ కేంద్రంలోకి సెల్ ఫోల్ నిషేధం కాగా..సెల్ ఫోన్ తో వెళ్లి ఏకంగా ఫొటోలు తీయడం వివాదాస్పదంగా మారింది. ఈ ఘటనపై స్పందించిన ఎన్నికల ఆఫీసర్లు.. ఎంక్వైరీ చేపట్టి రూల్స్ ప్రకారం చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు.