మహిళలను, మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ఎవరూ అంచనావేయలేరు

మహిళలను, మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ఎవరూ అంచనావేయలేరు
  • ఇండియా కా టైమ్‌‌ ఆగయా!
  • ఫ్యూచర్​ మనదే

బిజినెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డెస్క్‌‌‌‌‌‌‌‌, వెలుగు: ‘వాతావరణాన్ని, చావును, మహిళలను, మార్కెట్‌‌‌‌‌‌‌‌ను ఎవరూ అంచనావేయలేరు. మహిళలానే మార్కెట్ కూడా అనిశ్చితిగా, కమాండింగ్‌‌‌‌‌‌‌‌గా, వోలటైల్​గా ఉంటుంది. మహిళను నువ్వు ఎప్పటికి డామినేట్ చేయలేవు. అలానే మార్కెట్‌‌‌‌‌‌‌‌ను కూడా’..తాజాగా సీఐఐ మీటింగ్‌‌‌‌‌‌‌‌లో పాల్గొన్న బిగ్‌‌‌‌‌‌‌‌బుల్‌‌‌‌‌‌‌‌ రాకేష్ జున్‌‌‌‌‌‌‌‌జున్‌‌‌‌‌‌‌‌ వాలా చేసిన వ్యాఖ్యలివి. మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కింగ్‌‌‌‌‌‌‌‌ అంటూ ఎవరూ లేరని, కింగ్ అనుకునేవాళ్లందరూ జైళ్లలో ఉన్నారని ఆయన పేర్కొన్నారు. కేవలం మార్కెట్ మాత్రమే కింగ్ అని వ్యాఖ్యానించారు. ‘ఇండియా టైమ్‌‌‌‌‌‌‌‌ వస్తుంది కాదు, వచ్చేసింది (ఇండియా కా టైమ్ ఆయేగా నహి, ఆ గయా హై)’ అని ప్రైమ్‌‌‌‌‌‌‌‌ మినిస్టర్ నరేంద్రమోడీకి ఇచ్చిన ప్రజెంటేషన్‌‌‌‌‌‌‌‌లో చెప్పానని అన్నారు.  రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ గురించి, తన ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ ఆకాశ గురించి జున్‌‌‌‌‌‌‌‌జున్‌‌‌‌‌‌‌‌ వాలా అనేక విషయాలను పంచుకున్నారు.  

రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ సూపర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌..
‘కమర్షియల్ రియల్‌‌‌‌‌‌‌‌ఎస్టేట్‌‌‌‌‌‌‌‌పై చాలా బుల్లిష్‌‌‌‌‌‌‌‌గా ఉన్నా. ఎందుకంటే  ప్రస్తుతం కమర్షియల్ స్పేస్‌‌‌‌‌‌‌‌లో 50% వాటా సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్ ఇండస్ట్రీనే వాడుతోంది. ఇంకో ఐదేళ్లలో  ఈ వాటా 75 శాతానికి పెరుగుతుంది. సాఫ్ట్‌‌‌‌‌‌‌‌వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, ఫార్మా రీసెర్చ్ వంటి సెగ్మెంట్‌‌‌‌‌‌‌‌లు మరింత విస్తరిస్తాయి. దీంతో కమర్షియల్ రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ సెక్టార్ కూడా పెరుగుతుంది. వచ్చే ఐదేళ్లలో దేశ ఐటీ సెక్టార్  50 లక్షల ఉద్యోగాలను క్రియేట్ చేయగలుగుతుంది. రెసిడెన్షియల్ హౌస్‌‌‌‌‌‌‌‌ల డిమాండ్ పెరుగుతూనే ఉంటుంది. అలానే వేర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌హౌసింగ్‌‌‌‌‌‌‌‌లకు ఫుల్ డిమాండ్ క్రియేట్ అవుతుంది’ అని జున్‌‌‌‌‌‌‌‌జున్ వాలా పేర్కొన్నారు.    ఒకవేళ తానే రియల్ ఎస్టేట్ డెవలపర్ అయితే తన కంపెనీని మార్కెట్‌‌‌‌‌‌‌‌లో లిస్ట్​ చేయనని ఆయన అన్నారు. ఈ కంపెనీలు లిస్టింగ్ చేయాల్సినవి కావని అభిప్రాయపడ్డారు. ‘డీఎల్‌‌‌‌‌‌‌‌ఎఫ్‌‌‌‌‌‌‌‌ షేరు  ఒకానొక దశలో రూ. 1,300 కు చేరుకుంది. తర్వాత రూ. 80 వరకు పడింది. లిస్టింగ్ ఉద్దేశం ఏంటో నాకు అర్థం కావడం లేదు?  కానీ, కంపెనీలు తమ సైజును పెంచుకోవాలి. తన హోటల్స్‌‌‌‌‌‌‌‌ బిజినెస్‌‌‌‌‌‌‌‌లను లిస్టింగ్ చేసిన రవి రహేజా, తన కన్‌‌‌‌‌‌‌‌స్ట్రక్షన్‌‌‌‌‌‌‌‌ కంపెనీని ఎందుకు లిస్టింగ్ చేయలేదు?’ అని జున్ జున్ వాలా ప్రశ్నించారు. కానీ, రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ కంపెనీలు రైట్స్‌‌‌‌‌‌‌‌ (రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ ట్రస్ట్) లో లిస్ట్ చేయడం బెటర్ అని  పేర్కొన్నారు. తనకు రియల్ ఎస్టేట్ కంపెనీ ఉంటే  మార్కెట్‌‌‌‌‌‌‌‌లో కంటే రైట్స్‌‌‌‌‌‌‌‌లో ఇన్వెస్ట్ చేస్తానని అన్నారు. కాగా, రైట్స్‌‌‌‌‌‌‌‌లో కొన్ని రియల్ ఎస్టేట్‌‌‌‌‌‌‌‌ అసెట్‌‌‌‌‌‌‌‌లు ఉంటాయి. వీటిలో ఇన్వెస్టర్లు డబ్బులు పెడితే, ఈ అసెట్ల ద్వారా వచ్చిన లాభాలను ఇన్వెస్టర్లకు పంచుతారు.   

రియల్టీ డెవలపర్లకు సలహా..
‘నిలబెట్టుకోలేని హామీలను ఇవ్వొద్దు. రెస్పాన్స్‌‌బుల్‌‌గా ఉంటే అసెట్లకు మంచి వాల్యూ పొందగలుగుతారు. గ్రోత్‌‌ అనేది ఒక ప్రాసెస్‌‌. పలుకుబడి, సరియైన టైమ్‌‌కి డెలివరీ చేయడం, మంచి క్వాలిటీని మెయింటైన్ చేయడం వంటి అనేక అంశాలు డెవలపర్ల అసెట్లకు మంచి ధరను ఇస్తాయి’ అని జున్‌‌జున్ వాలా డెవలపర్లకు సలహాయిచ్చారు. 

ఇల్లు కోసం క్రిసిల్ షేర్లు అమ్మకుంటే బాగుండే.. 
ఇప్పటికే నాలుగు–ఐదు ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లలో ఇన్వెస్ట్ చేశానని, వేటిలో కూడా ఇంకా డబ్బులు సంపాదించలేదని పేర్కొన్నారు. తన ఇన్వెస్ట్‌‌‌‌‌‌‌‌మెంట్ యాక్టివిటీని తగ్గించాలనుకుంటున్నానని చెప్పారు. జున్‌‌‌‌‌‌‌‌జున్ వాలా తన రియల్‌‌‌‌‌‌‌‌ ఎస్టేట్ అనుభవాన్ని పంచుకున్నారు. ‘2006–07 లో తన  క్రిసిల్‌‌‌‌‌‌‌‌ షేర్లను అమ్మేసి రూ. 27 కోట్ల విలువైన ఇంటిని తీసుకున్నా. ఇప్పుడు ఆ ఇంటి వాల్యూ రూ. 45 కోట్లకు పెరిగింది. అదే ఆ క్రిసిల్‌‌‌‌‌‌‌‌ షేర్లను హోల్డ్ చేసి ఉంటే వాటి విలువ రూ. 1,000 కోట్లకు చేరేది. మన మనస్తత్వం ఎలా ఉంటుందంటే మనకంటూ కచ్చితంగా ఒక ఇల్లు ఉండాలి. తప్పదన్నట్టు’ అని ఆయన అన్నారు.

ఆకాశ ఎయిర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌పై..
ఆకాశ  ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ను స్టార్ట్ చేశామంటే చాలా మంది చాలా ప్రశ్నలు వేస్తున్నారని జున్‌‌‌‌జున్‌‌‌‌ వాలా పేర్కొన్నారు. కాగా, టాటా గ్రూప్‌ ఎయిర్‌‌‌‌‌‌‌‌ ఇండియా కోసం రూ. 18,000 కోట్లు ఇన్వెస్ట్ చేసిందని, తాము 50 మిలియన్ డాలర్లు (రూ. 375 కోట్లు) ఇన్వెస్ట్ చేశామని జున్‌జున్‌ వాలా అన్నారు. ఎయిర్‌‌లైన్ బిజినెస్‌ గురించి తన  దగ్గర నేర్చుకుంటానని చంద్రశేఖరన్‌(టాటా సన్స్‌) తో చెప్పానన్నారు. ‘ఇప్పటికే మా దగ్గర ఒక బిజినెస్ ప్లాన్ ఉంది.  యూరప్‌‌‌‌లో 10 నేషనల్ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీలు దివాలా తీసినా, రైన్‌‌‌‌ ఎయిర్ మొదటి రోజు నుంచే ప్రాఫిట్‌‌‌‌లో నడిచింది. మాకంటూ ఒక గేమ్ ప్లాన్ ఉంది. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల నుంచి ఏవియేషన్ ఇండస్ట్రీ ఎదుగుతుంది’ అని జున్‌జున్‌ వాలా అంచనావేశారు. తమ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్‌‌‌‌ను అల్ట్రా లో కాస్ట్ అని పిలవమని, ‘ఎకానమీ’ అని పిలుస్తామని అన్నారు. పొదుపుగా వాడడం కూడా ఒక కల్చర్ అని, తన ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ బిజినెస్‌‌‌‌లో ఈ కల్చర్‌‌‌‌‌‌‌‌ మొదటి రోజు నుంచే కనిపిస్తుందని అన్నారు.

మా ఆవిడ నగలు అమ్మలేదు..
ఇండిగో మార్కెట్ ప్రస్తుతం రూ. 80 వేల కోట్లుగా ఉందని, తమ టాప్‌‌‌‌‌‌‌‌ మేనేజ్‌‌‌‌మెంట్‌‌‌‌లో 50 % మంది  ఇండిగో నుంచి వచ్చిన వారే ఉన్నారని జున్‌‌‌‌జున్ వాలా చెప్పారు. ప్రయత్నించకుండా వదిలేయడం కంటే ప్రయత్నించి ఫెయిల్ అవ్వడం బెటర్ అని, అందుకే ఈ బిజినెస్‌‌‌‌లోకి ఎంటర్ అయ్యానని పేర్కొన్నారు. ‘ఆకాశలో రూ. 275 కోట్లు ఇన్వెస్ట్ చేస్తున్నా. ఈ ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ కంపెనీ రూ. 10, 000 కోట్ల మార్కెట్‌‌‌‌ క్యాప్‌‌‌‌ను చేరుకోవాలన్నది టార్గెట్‌‌‌‌. ఇండిగోకు ఉన్న విమానాల్లో నాల్గో వంతు విమానాల కోసం ఆర్డర్‌‌‌‌‌‌‌‌ ఇచ్చాం. ఈ బిజినెస్‌‌‌‌ కోసం నా భార్య నగలను తనఖా పెట్టలేదు. నా సొంత డబ్బులతో ఇన్వెస్ట్ చేస్తున్నా.  నా ఎయిర్‌‌‌‌‌‌‌‌లైన్ బిజినెస్‌‌‌‌ గురించి ప్రజలు ఆశ్చర్యపోతుండడాన్ని చూస్తుంటే నాకూ ఆశ్చర్యమేస్తోంది’ అని చెప్పారు. తను మార్కెట్‌‌‌‌లోకి ఎంటర్ అయినప్పుడు నీకు పిల్లనెవరిస్తారు? అని మా అమ్మ అడిగింది. జాబ్‌‌‌‌ చేసుకుంటే బాగుండేదని అప్పుడు  అనిపించింది కూడా.  కానీ, వాళ్లందరూ తప్పు అని నిరూపించగలిగా’ అని జున్‌‌‌‌జున్ వాలా వివరించారు.