ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

ప్రగతి భవన్ లో ఘనంగా రక్షా బంధన్ వేడుకలు

రక్షా బంధన్  వేడుకలు ప్రగతి భవన్ లో ఘనంగా జరిగాయి. అక్కాచెల్లెళ్ల రాకతో సీఎం కేసీఆర్  నివాసంలో సందడి నెలకొంది. అక్కలు లలితమ్మ, లక్ష్మమ్మ, జయమ్మ, చెల్లెలు వినోదమ్మ కేసీఆర్ కు రాఖీలు కట్టారు. అనంతరం సీఎం వాళ్ల కాళ్లు మొక్కి ఆశీర్వాదం తీసుకున్నారు. 

మరోవైపు సీఎం కేసిఆర్ మనువడు, మనుమరాలు రక్షా బంధన్ వేడుకలు జరుపుకున్నారు.  అన్న  హిమాన్షుకు అలేఖ్య రాఖీ కట్టింది. అనంతరం మనువడు, మనుమరాలు కేసీఆర్, శోభమ్మ ఆశీర్వాదం తీసుకున్నారు.