శంకర్​ టీమ్​లో రకుల్ ?

శంకర్​ టీమ్​లో రకుల్ ?

కూల్‌‌గా కెరీర్‌‌‌‌ మొదలుపెట్టిన రకుల్… తెలుగు, తమిళ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తూ బిజీగానే ఉంది. త్వరలో ‘మన్మథుడు 2’తో రాబోతోంది. అయితే ఇంతలోనే ఆమె ఓ భారీ ప్రాజెక్టులో చోటు సంపాదించినట్లు తెలుస్తోంది. అది మరేదో కాదు.. ‘భారతీయుడు 2’. కమల్ హాసన్, శంకర్‌‌‌‌ల కాంబినేషన్‌‌లో వస్తున్న ఈ మూవీపై మామూలుగా లేవు అంచనాలు. అయితే ప్రారంభం నుంచీ సినిమా పనులు నత్త నడకన సాగుతూ ఉండటంతో ప్రాజెక్ట్ ఆగిపోయిందేమోనన్న సందేహాలు తలెత్తాయి. కానీ అది నిజం కాదని, వచ్చే నెలలో సినిమా సెట్స్‌‌కి వెళ్లబోతోందని రీసెంట్‌‌గా తెలిసింది.

ఎప్పుడూ బడ్జెట్​ను భారీగా ప్లాన్ చేసే శంకర్ ఈసారి కాస్టింగ్‌ విషయంలో కూడా అదే చేస్తున్నాడు. ఆల్రెడీ హీరోయిన్‌‌గా కాజల్​ని, సెకెండ్ హీరోగా సిద్ధార్థని తీసుకున్నాడు. ఐశ్వర్యా రాజేష్‌‌, ప్రియా భవానీ శంకర్‌‌‌‌లను కీలక పాత్రలకి సెలెక్ట్ చేశాడు. ఇప్పుడు సిద్ధార్థకి హీరోయిన్‌‌గా రకుల్‌‌ని తీసుకున్నాడట. అయితే రకుల్ తన ఇమేజ్‌‌ని బట్టి కమల్ పక్కనైతే ఓకేఅంటుంది కానీ సిద్ధార్థ పక్కన సరేనంటుందా అన్నదే సందేహం. కమల్ సినిమా, శంకర్‌‌‌‌ డైరెక్షన్, లైకా ప్రొడక్షన్‌‌ కాబట్టి  అన్నా అనొచ్చు. అంటే మాత్రం ఆమెని ఓ మంచి చాన్స్ వరించినట్టే.