గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, బుచ్చిబాబు సన కాంబినేషన్లో వచ్చిన మోస్ట్ అవేటెడ్ రూరల్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది' (Peddi). జూన్ 4, 2026న ప్రపంచవ్యాప్తంగా భారీ అంచనాలతో విడుదలైన ఈ చిత్రం.., బాక్సాఫీస్ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తుంది. ఈ ఏడాదిలోనే బిగ్గెస్ట్ ఇండియన్ బ్లాక్‌బస్టర్స్‌లో ఒకటిగా నిలిచింది. టాక్‌తో సంబంధం లేకుండా చరణ్ మాస్ రాంపేజ్కు థియేటర్లు దద్దరిల్లుతున్నాయి.
బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్..
ఈ 'పెద్ది' సినిమాకు మిశ్రమ స్పందన వచ్చినప్పటికీ, రామ్ చరణ్ ఊరమాస్ పర్ఫార్మెన్స్, ఏఆర్ రెహమాన్ బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ ప్రేక్షకులను థియేటర్లకు రప్పిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా రూ. 400 కోట్లకు పైగా వసూళ్లు రాబట్టి రికార్డు సృష్టించింది. ప్రస్తుతం 3వ వారంలో రన్ అవుతున్న ఈ సినిమా, వీక్‌డేస్‌లో ఆక్యుపెన్సీ కొద్దిగా తగ్గినప్పటికీ స్టెడీగా సాగుతోంది. ప్రస్తుతం థియేటర్లలో సమంత ‘మా ఇంటి బంగారం’ సినిమా నుంచి గట్టి పోటీ ఎదురవుతున్నప్పటికీ, మాస్ సెంటర్లలో 'పెద్ది' హవా తగ్గలేదు.
నెట్‌ఫ్లిక్స్‌లో 'పెద్ది' సందడి...
థియేట్రికల్ రన్‌తో దుమ్మురేపుతున్న ఈ చిత్రం డిజిటల్ ప్రీమియర్‌కు సంబంధించి ఫిలింనగర్లో ఒక క్రేజీ బజ్ నడుస్తోంది. పెద్ది' డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్‌ను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ (Netflix) ఏకంగా రూ. 105 కోట్లకు సొంతం చేసుకున్నట్లు సమాచారం. మొదట జూలై 2న ఈ సినిమాను ఓటీటీలోకి తీసుకురావాలని భావించినప్పటికీ, థియేటర్లలో కలెక్షన్స్ బాగుండటంతో డేట్‌ను రివైజ్ చేసినట్లు టాక్. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం, జూలై 16న ఈ చిత్రం నెట్‌ఫ్లిక్స్‌లో స్ట్రీమింగ్ అయ్యే అవకాశం ఉంది. తెలుగుతో పాటు తమిళం, హిందీ, కన్నడ, మలయాళ భాషల్లో ఏకకాలంలో ఈ సినిమా డిజిటల్ స్క్రీన్స్ పైకి రానుంది.
బుచ్చిబాబు సన పల్లెటూరి నేపథ్యంలో విజువల్ వండర్‌గా తెరకెక్కించిన ఈ చిత్రంలో చరణ్ సరసన లక్కీ బ్యూటీ జాన్వీ కపూర్ కథానాయికగా నటించింది. వృద్ధి సినిమాస్, సుకుమార్ రైటింగ్స్ బ్యానర్లపై భారీ బడ్జెట్‌తో ఈ సినిమా రూపొందింది. మొత్తానికి థియేటర్లలో రూ. 400 కోట్లతో రికార్డులు తిరగరాసిన 'పెద్ది'.. ఇక ఓటీటీలో ఎలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి...
