రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పెద్ది’. బుచ్చిబాబు సాన దర్శకత్వం వహిస్తున్నాడు. మైత్రి మూవీ మేకర్స్, సుకుమార్ రైటింగ్స్ సమర్పణలో వెంకట సతీష్ కిలారు నిర్మిస్తున్నారు. ఈ చిత్రాన్ని రామ్ చరణ్ బర్త్‌డే సందర్భంగా మార్చి 27న విడుదల చేయనున్నట్టు ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే కొంత వర్క్ బ్యాలెన్స్ ఉండటంతో మూవీ టీమ్ ఈ డేట్‌ను పోస్ట్‌పోన్ చేస్తున్నట్టు తెలుస్తోంది. సమ్మర్ స్పెషల్‌గా మే 1న ఈ సినిమాను వరల్డ్‌వైడ్‌గా రిలీజ్ చేయడానికి ప్లాన్ చేస్తున్నారట.
ఈ విడుదల వాయిదా విషయంలో టీమ్ నుంచి అఫీషియల్ అనౌన్స్‌మెంట్ వచ్చే చాన్స్ ఉంది. రూరల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ చిత్రంలో రామ్ చరణ్ మాస్ లుక్‌లో కనిపించనున్నాడు. జాన్వీ కపూర్ హీరోయిన్‌గా నటిస్తుండగా, కన్నడ స్టార్ శివ రాజ్ కుమార్, జగపతి బాబు, దివ్యేందు శర్మ ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ గ్లింప్స్, ‘చికిరి చికిరి’ పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ఎ.ఆర్.రెహమాన్ సంగీతం అందిస్తున్నారు.
