Ram Charan: సీఎం విజయ్‌పై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్.. ఖుషీలో దళపతి ఫ్యాన్స్!

Ram Charan: సీఎం విజయ్‌పై రామ్ చరణ్ క్రేజీ కామెంట్స్.. ఖుషీలో దళపతి ఫ్యాన్స్!

మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, టాలెంటెడ్ డైరెక్టర్ బుచ్చిబాబు సన కాంబినేషన్‌లో వస్తున్న మోస్ట్ అవేటెడ్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామా 'పెద్ది'. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా పాన్ ఇండియా రేంజ్‌లో రిలీజ్ కాబోతున్న ఈ సినిమాపై అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. ఈ మూవీ ప్రమోషన్స్ లో భాగంగా లేటెస్ట్ గా చెన్నైలో 'పెద్ది' టీమ్  ప్రెస్ మీట్ నిర్వహించింది. ఈ వేడుకలో రామ్ చరణ్ తమిళనాడు నూతన ముఖ్యమంత్రి, దళపతి విజయ్‌పై చేసిన కామెంట్స్ ఇప్పుడు సోషల్ మీడియాలో నేషనల్ వైడ్‌గా ట్రెండ్ అవుతున్నాయి.

విజయ్‌పై క్రేజీ కామెంట్స్..

సినీ ఇండస్ట్రీలో కెరీర్ పీక్ స్టేజ్‌లో ఉన్నప్పుడే, ఆ రేంజ్ స్టార్‌డమ్‌ను వదిలేసి ప్రజాసేవ కోసం విజయ్ రాజకీయాల్లోకి రావడం, అసెంబ్లీ ఎన్నికల్లో గ్రాండ్ విక్టరీ సాధించి సీఎం కావడంపై రామ్ చరణ్ ప్రశంసల వర్షం కురిపించారు. సీఎం జోసెఫ్ విజయ్‌ను చూస్తుంటే సినీ ఇండస్ట్రీకి చెందిన వ్యక్తిగా నాకు ఎంతో గర్వంగా ఉంది. విజయ్ కు, తమిళనాడు ప్రజలకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు అని చరణ్ అనడంతో విజయ్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో రచ్చ లేపుతున్నారు.

 

'పెద్ది' కోసం మెగాస్టెప్స్.

ఈ సందర్భంగా చరణ్ 'పెద్ది' సినిమా కోసం పడిన కష్టాన్ని పంచుకున్నారు. బుచ్చిబాబు ఈ స్క్రిప్ట్ కోసం ఐదారేళ్లు శ్రమిస్తే, తాను ఏకంగా 285 రోజులు షూటింగ్‌లో పాల్గొన్నట్లు చెప్పారు. ఈ మూవీ కోసం చరణ్ సరికొత్త మేకోవర్‌తో పాటు మూడు రకాల స్పోర్ట్స్ గేమ్స్ కూడా నేర్చుకోవడం విశేషం. ఇప్పటికే ఈ మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్, టీజర్ రికార్డులు సృష్టిస్తున్నాయి. 

భారీ అంచనాలతో రెడీ..

'ఉప్పెన' లాంటి బ్లాక్‌బస్టర్ తర్వాత బుచ్చిబాబు తెరకెక్కిస్తున్న చిత్రం కావడంతో, ఇందులో హై-వోల్టేజ్ యాక్షన్‌తో పాటు హృదయాన్ని కదిలించే ఎమోషన్, ఒక మంచి సందేశం కూడా ఉండబోతున్నాయని చరణ్ తెలిపారు..  ఆస్కార్ విజేత ఏఆర్ రెహమాన్ ఈ చిత్రానికి మ్యూజిక్ అందించారు. గత 15 రోజులుగా ఆయన నిర్విరామంగా రీ-రికార్డింగ్ (BGM) పనుల్లో బిజీగా ఉన్నారని, పాటలు నెక్స్ట్ లెవెల్‌లో ఉంటాయని చరణ్ హింట్ ఇచ్చారు.

►ALSO READ | Sobhita Dhulipala: 34లోకి అడుగుపెడుతున్న అక్కినేనివారి కోడలు.. శోభిత ధూళిపాళ సక్సెస్ స్టోరీ

ఇక కన్నడ సూపర్ స్టార్ శివరాజ్‌కుమార్ (శివన్న) ఈ సినిమాలో పవర్‌ఫుల్ రోల్ చేస్తున్నారు. 'జైలర్' రేంజ్ గూస్‌బంప్స్ ఇందులోనూ ఉంటాయట. ఇక బాలీవుడ్ నటుడు దివ్యేందు, రామ్ చరణ్ కాంబో సీన్స్ థియేటర్లలో పేలుతాయని టాక్. అతిలోక సుందరి శ్రీదేవి వారసత్వాన్ని జాన్వీ కపూర్ నిలబెడుతుందని, ఆమె డెడికేషన్ అద్భుతమని చరణ్ కొనియాడారు.

రత్నవేలు సినిమాటోగ్రఫీ ప్రతి ఫ్రేమ్‌ను విజువల్ వండర్‌గా మార్చిందని ప్రశంసించారు. ఇండస్ట్రీ గర్వపడేలా ఉండబోతున్న 'పెద్ది' బాక్సాఫీస్ వద్ద సరికొత్త రికార్డులు సృష్టించడం ఖాయం అని ధీమా వ్యక్తం చేశారు చిత్ర యూనిట్. మరి జూన్ 4న థియేటర్లలో ఎలాంటి మాస్ జాతర సృష్టిస్తుందో చూడాలి.