రామ్ చరణ్ నటిస్తున్న ‘పెద్ది’ సినిమా సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది. జూన్ 4న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అవుతుండటంతో ఆడియన్స్ లుక్ అంతా పెద్దిపైనే ఉంది. అంతేకాకుండా, చాలా రోజుల తర్వాత థియేటర్లోకి వస్తున్న భారీ బడ్జెట్, స్టార్ హీరో సినిమా కావడంతో సినీ సర్కిల్లో పండుగ వాతావరణం నెలకొంది. ఇప్పటికే, ట్రైలర్, సాంగ్స్ విడుదలయ్యి సినీ ఫ్యాన్స్‌లో కూడా భారీ అంచనాలు పెంచేశాయి. ఈ నేపథ్యంలోనే ఏపీ ప్రభుత్వం పెద్ది మేకర్స్‌కి గుడ్ న్యూస్ అందించింది. ‘పెద్ది’ సినిమా టికెట్ రేట్లు పెంచుతూ జీవో జారీ చేసింది.
‘పెద్ది’ ప్రీమియర్స్
ఈ సందర్భంగా బుధవారం జూన్ 3 రాత్రి 8 గంటల నుంచి ‘పెద్ది’ ప్రీమియర్స్ మొదలవ్వనున్నాయి. ఈ స్పెషల్ షోలకు ఒక్కో టికెట్ ధరను జీఎస్టీతో కలిపి రూ.600గా నిర్ణయించింది ప్రభుత్వం. అలాగే జూన్ 4 నుంచి 10 రోజుల పాటు సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.100, మల్టీప్లెక్స్‌లలో రూ.125 అదనంగా టికెట్ ధరలు పెంచుకునేందుకు అనుమతి ఇచ్చారు. దీనితో పాటు రోజుకు ఐదు షోలు ప్రదర్శించేందుకు కూడా ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అయితే తెలంగాణలో టికెట్ రేట్ల పెంపుపై ఇంకా స్పష్టత రాలేదు. ప్రస్తుతం నిర్మాతలు, ఎగ్జిబిటర్ల మధ్య కొనసాగుతున్న ‘పర్సంటేజ్ సిస్టమ్’ వివాదం కారణంగా తెలంగాణ ప్రభుత్వం నిర్ణయం ఆలస్యమయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో ‘పెద్ది’కి తెలంగాణలో కూడా ధరల పెంపు అనుమతి లభిస్తుందా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఇక టికెట్ రేట్లకి కూడా పర్మిషన్ రావడంతో అడ్వాన్స్ బుకింగ్స్ కోసం మెగా ఫ్యాన్స్ వెయిట్ చేస్తున్నారు. అయితే, ఫస్ట్ ఏపీలోనే బుకింగ్స్ మొదలయ్యే ఛాన్స్ ఉంది. తెలంగాణలో టికెట్ ధరలపై ఓ డెసిషన్ తీసుకున్నాకే అడ్వాన్స్ బుకింగ్స్ ఓపెన్ చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు చెబుతున్నాయి.
‘పెద్ది’ సెన్సార్..
ఇప్పటికే సెన్సార్ పూర్తిచేసుకుంది. సెన్సార్ బోర్డు ‘పెద్ది’ సినిమాకు ‘U/A’ సర్టిఫికేట్ జారీ చేసింది. సెన్సార్ నుంచి క్లియరెన్స్ రావడమే కాకుండా, సినిమా చూసిన అధికార బృందం చరణ్ నటనకు ఫిదా అయ్యారని సమాచారం. సుమారు 3 గంటల 9 నిమిషాల (189 నిమిషాలు) రన్టైమ్తో రానుంది. ప్రస్తుతం వరుస అప్డేట్స్, ప్రమోషన్స్ తో దూసుకెళ్తోంది.
గుండెల్ని పిండేసే సెంటిమెంట్..
‘ఉప్పెన’ ఫేమ్ బుచ్చిబాబు రూరల్ రస్టిక్ స్పోర్ట్స్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కించారు. 1980ల గ్రామీణ నేపథ్యంలో సాగే ఈ చిత్రం, క్రీడలు మరియు భావోద్వేగాల మేళవింపుతో పవర్ఫుల్ యాక్షన్ ఎలిమెంట్స్ ప్రేక్షకులను కట్టిపడేస్తుందని టాక్. కేవలం యాక్షన్ మాత్రమే కాకుండా, గుండెల్ని పిండేసే బలమైన సెంటిమెంట్ ఈ సినిమాలో హైలైట్ కానుందని టాక్. జూన్ 4న థియేటర్లు స్టేడియంలుగా మారడం.. రికార్డుల వేట మొదలవడం ఖాయం అని ఫ్యాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మరి బాక్సాఫీస్ వద్ద ‘పెద్ది’ ఎలాంటి రికార్డులు సృష్టిస్తుందో చూడాలి.
