ధనరాజ్ రామం రాఘవం.. తండ్రీకొడుకుల కథ

ధనరాజ్ రామం రాఘవం.. తండ్రీకొడుకుల కథ

సముద్రఖని ప్రధాన పాత్రలో నటుడు ధనరాజ్ తెలుగు, తమిళ భాషల్లో తెరకెక్కించిన చిత్రం ‘రామం రాఘవం’. ఈ మూవీ టీజర్‌‌‌‌‌‌‌‌ను చైన్నైలో లాంచ్ చేశారు. దర్శకుడు బాలా పాండిరాజ్, సముద్రఖని, నటులు బాబీ సింహా, తంబి రామయ్య, సూరి, దీపక్, హరీష్ తదితరులు పాల్గొన్నారు. సముద్రఖని మాట్లాడుతూ ‘ప్రతి తండ్రీ కొడుకుల మధ్య ఉండే బంధాన్ని చాటే చిత్రం ఇది. 

ధనరాజ్‌‌‌‌పై నమ్మకంతో అతన్నే దర్శకత్వం చేయమని చెప్పా.  దర్శకుడిగా అతను పెద్ద విజయాన్ని అందుకుంటాడు. సినిమా చాలా అద్భుతంగా వచ్చింది’ అని చెప్పాడు. దర్శకుడు ధనరాజ్ మాట్లాడుతూ ‘రచయిత శివప్రసాద్ రాసిన కథ ఇది. ఇప్పటి వరకు 100 చిత్రాల్లో నటించా. ఆ సినిమా దర్శకులంతా నా గురువులే. వారు నేర్పిన పాఠాలతో ఈరోజు దర్శకుడిగా మారా. అందరూ తమ తండ్రితో కలిసి ఈ సినిమా చూడండి’ అని చెప్పాడు.