'రామబాణం' సరికొత్త రూట్... పాల ప్యాకెట్లతో ప్రమోషన్

'రామబాణం' సరికొత్త రూట్... పాల ప్యాకెట్లతో ప్రమోషన్

మ్యాచో స్టార్ గోపీచంద్ ప్రధాన పాత్రలోశ్రీవాస్ డైరెక్షన్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ రామబాణం. మే 5న ప్రేక్షకుల ముందుకు రానుంది. కంప్లీట్ ఫ్యామిలీ అండ్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ మూవీపై ప్రేక్షకుల్లో మంచి అంచనాలే ఉన్నాయి. ఇక తాజాగా కర్నూల్ లో  సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను కూడా నిర్వచించారు. అయితే ఈ సినిమాను జనాల్లోకి తీసుకెళ్లేందుకు చిత్ర యూనిట్ తెగ కష్టపడుతున్నారు. ఇందుకోసం సరికొత్త రూట్ ని ఎంచుకున్నారు. 

ఈ రోజుల్లో ప్రతి ఒక్కరూ పాల ప్యాకెట్లు వేయించుకోవడం కామనే కదా. ఆ పాల ప్యాకెట్ల ద్వారానే ఈ మూవీని  ప్రేక్షకుల్లోకి తీసుకెళ్లాలని చూస్తోంది రామబాణం టీమ్. ఇందుకోసం.. పాల ప్యాకెట్లపై తమ సినిమా పోస్టర్లు ముద్రించి టిని ఇంటింటికీ చేరువయ్యేలా చేస్తున్నారు. అదికూడా సంగం డెయిరీ పాల ప్యాకెట్లపై. 

ఈ ఐడియాకి ప్రేక్షకుల నుండి కూడా మంచి స్పందనే వస్తోంది. ఈ ఐడియా భలే ఉందని, ఇలాంటి ప్రచారం గతంలో ఎవరూ చేయలేదని సోషల్ మీడియా వేదికగా కామెంట్స్ పెడుతున్నారు. మరి.. ఈ ప్రమోషనల్ ఐడియా సినిమా విజయంలో ఎంతవరకు ఉపయోగపడనుందో తెలియాలంటే మే 5వ తేదీ వరకు ఆగాల్సిందే.