బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవం

బీజేపీ తెలంగాణ అధ్యక్షుడిగా రామచందర్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.  ఎన్నిక నియామకపత్రాన్ని రామచందర్ రావుకు అందజేశారు శోభాకరంద్లాజె .  కిషన్ రెడ్డి నుంచి రామచందర్ రావు బాధ్యతలను తీసుకున్నారు. పార్టీ జెండాను రామచందర్ రావుకు అందించారు కిషన్ రెడ్డి.  

 కొత్తగా ఎన్నికైన రామచందర్ రావకు పార్టీ సీనియర్ నాయకులు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్బంగా కిషన్ రెడ్డి, బండి సంజయ్, డీకే అరుణ,లక్ష్మణ్ పలువురు సీనియర్ బీజేపీ నాయకులు రామచందర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. ఈ సందర్భంగా మాట్లాడిన కేంద్రమంత్రి కిషన్ రెడ్డి..క్యాడర్ బేస్ పార్టీ బీజేపీ అని..పార్టీ కార్యకర్తలే నాయకులని అన్నారు. తెలంగాణలో బీజేపీకి 34 లక్షల సభ్యత్వం ఉందని చెప్పారు. 

మరో వైపు బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా మాధవ్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మాధవ్ ఎన్నికైనట్లు బీజేపీ జాతీయ కౌన్సిల్ సభ్యుడు మోహన్ ప్రకటించారు. పురందేశ్వరీ పార్టీ బాధ్యతలను మాధవ్ కు అప్పగించారు.