గోదావరిఖని, వెలుగు: నేరాల నియంత్రణకు కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిశోర్ ఝా తెలిపారు. మంగళవారం సీపీ ఆఫీస్‌లో పెద్దపల్లి, మంచిర్యాల జోన్ల పరిధిలోని ఏసీపీలు, సీఐలు, ఎస్‌హెచ్‌వోలతో పెండింగ్ కేసులపై రివ్యూ చేశారు. ఇప్పటివరకు నమోదైన కేసులు, పెండింగ్ కేసుల వివరాలు, దర్యాప్తులో జాప్యానికి గల కారణాలను అధికారులను అడిగి తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం త్వరితగతిన జరిగేలా న్యాయాధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
కేసుల ఛేదనలో టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో డీసీపీలు ఎ.భాస్కర్, బి.రామ్ రెడ్డి, అడిషనల్ డీసీపీ (అడ్మిన్) కె.శ్రీనివాస్, ఏసీపీలు ఎం.రమేశ్, ఆర్.ప్రకాష్, వెంకటేశ్వర్లు, కిరణ్ కుమార్, స్పెషల్ బ్రాంచ్ ఏసీపీ నాగేంద్ర గౌడ్, ట్రాఫిక్ ఏసీపీ శ్రీనివాస్, పాల్గొన్నారు.
