గోదావరిఖని, వెలుగు: రామగుండం కార్పొరేషన్‌లో మొన్నటి వరకు ఎన్నికల్లో పోటీకి సై అన్న మాజీ కార్పొరేటర్లు, కౌన్సిలర్లు రాజీకొచ్చారు. ఎన్నికల్లో పోటీ చేయకుండా పార్టీ అభ్యర్థులకు మద్దతు పలికేందుకు ముందుకు వచ్చారు. 38వ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి నెలకంటి రాము, మాజీ కార్పొరేటర్ బొమ్మక శైలజ రాజేశ్పోటీ పడ్డారు. అయితే అనూహ్యంగా నెలకంటి రాముకు మద్దతుగా నిలుస్తున్నట్టు బొమ్మక రాజేశ్ ఎమ్మెల్యే రాజ్‌ఠాకూర్ సమక్షంలో ప్రకటించారు.
53వ డివిజన్‌లో కాంగ్రెస్ నుంచి పోటీకి దిగిన గట్ల రమేశ్‌కు మాజీ కార్పొరేటర్ ధరణి జలపతి మద్దతు తెలిపారు. 44వ డివిజన్‌లో కాంగ్రెస్ అభ్యర్థికి మద్దతుగా మాజీ కార్పొరేటర్
పాముకుంట్ల భాస్కర్.. బీఆర్‌ఎస్ నుంచి కాంగ్రెస్‌లో చేరారు. మొన్నటి వరకు నామినేషన్ వేయడానికి అన్ని ఏర్పాట్లు చేసుకున్న భాస్కర్ ఒక్కసారిగా సైలంట్ అయ్యారు. 13వ డివిజన్‌లో బీఆర్ఎస్ కార్పొరేటర్‌గా వ్యవహరించిన రాకం వేణు పోటీ నుంచి తప్పుకుని కటుకు ప్రవీణ్‌కు మద్దతు ఇస్తున్నట్టు ప్రకటించాడు. ఇలా రామగుండం కార్పొరేషన్ పరిధిలో ఎన్నికల వేళ అనూహ్యంగా కొందరు నామినేషన్లు వేయకుండా పోటీ నుంచి తప్పుకున్నారు.
