
ముచ్చింతల్ లో జరుగుతున్న సమతామూర్తి రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలు ఈ రోజుతో ముగియనున్నాయి. చివరి రోజు మహాపూర్ణాహుతి జరుగనుంది. ఈ నెల 2న ప్రారంభమైన వేడుకలు 12 రోజులపాటు వైభవంగా సాగాయి. కాసేపట్లో సహస్ర కుండలాల యజ్ఞానికి మహాపూర్ణాహుతి పలుకనున్నారు. 108 దివ్య దేశాల్లోని ఆలయాల మూర్తులకు శాంతి కల్యాణం నిర్వహించనున్నారు. సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల వరకు సీతారాముల కల్యాణ మహోత్సవం నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమాలకు సీఎం కేసీఆర్ తో పాటు క్యాబినెట్ మంత్రులు హాజరవుతారని తెలుస్తోంది.