ఘనంగా కొనసాగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

ఘనంగా కొనసాగుతున్న రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు

రామానుజ సహస్రాబ్ది ఉత్సవాలు ఘనంగా కొనసాగుతున్నాయి. 12రోజుల పాటు జరగనున్న ఈ ఉత్సవాలు మూడో రోజుకు చేరుకున్నాయి. ఈరోజు యాగశాలలో లక్ష్మీనారాయణ యాగం నిర్వహిస్తున్నారు. లోక కల్యాణార్ధం మహాకత్రువు నిర్వహిస్తున్నట్లు చినజీయర్ స్వామి తెలిపారు. యాగాలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఒక్కరు వచ్చి దర్శించుకోవాలన్నారు. ఈరోజు అష్టాక్షరీ మంత్ర జపం, హోమాలు, పూర్ణాహుతి, శ్రీ లక్ష్మీ నారాయణేష్టి, వైనతేయేష్టి నిర్వహించనున్నారు. అలాగే ప్రవచనాలు, సంగీత గానం, నృత్య ప్రదర్శనలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

నాలుగో రోజు ఉత్సవాల్లో ప్రధానఘట్టం ప్రధానిమోడీ చేతుల మీదుగా జరుగనుంది. రేపు సాయంత్రం ప్రధాని మోడీ ముచ్చింతల్ చేరుకోనున్నారు. 216 అడుగుల సమతామూర్తి భగవద్రామానుజుల విగ్రహాన్ని ఆవిష్కరించి.. జాతికి అంకితమివ్వనున్నారు. ఈ నెల 6న ఏపీ సీఎం జగన్ సహస్రాబ్ది వేడుకలకు రానున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సమతాస్ఫూర్తి కేంద్రాన్ని సందర్శించి లక్ష్మీ నారాయణ మహాయాగ క్రతువులో పాల్గొంటారని తెలుస్తోంది.