తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్‌‌‌‌గా రమేష్ గౌడ్

తెలంగాణ పవర్ లిఫ్టింగ్ ప్రెసిడెంట్‌‌‌‌గా రమేష్ గౌడ్

హైదరాబాద్‌‌‌‌:  తెలంగాణ పవర్ లిఫ్టింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్‌‌‌‌గా కొత్తపల్లి రమేష్‌‌‌‌ గౌడ్ ఎన్నికయ్యారు. శనివారం ఎల్బీ స్టేడియంలోని ఒలింపిక్ భవన్‌‌‌‌లో అసోసియేషన్‌‌‌‌ కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. చైర్మన్‌‌‌‌గా బుచ్చి దాస్ గౌడ్,  జనరల్ సెక్రెటరీగా జోసఫ్ జేమ్స్, ట్రెజరర్‌‌‌‌‌‌‌‌గా రవి సింగ్ బిడ్లండ్  ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని  పవర్ లిఫ్టింగ్ ఆఫ్​ ఇండియా అసోసియేషన్ ఫెడరేషన్, శాట్స్‌‌‌‌ అబ్సర్వర్లు ప్రకటించారు. త్వరలోనే జనరల్‌‌‌‌ బాడీ  మీటింగ్ నిర్వహించి  పవర్ లిఫ్టర్లకు సౌకర్యాలను కల్పిస్తామని రమేష్​ గౌడ్ తెలిపారు. అన్ని క్రీడలా మాదిరిగానే  పవర్ లిఫ్టింగ్‌‌‌‌కి కూడా నిధులు కేటాయించాలని ప్రభుత్వానికి విజ్ణప్తి చేశారు.