యానిమల్ మూవీ : 10 రోజుల్లో రూ.700 కోట్లు

యానిమల్ మూవీ : 10 రోజుల్లో రూ.700 కోట్లు

యానిమల్ సినిమా కలెక్షన్స్ దుమ్మురేపుతున్నాయి. 10 రోజులు అవుతున్నా.. కలెక్షన్స్ తగ్గకపోగా.. రోజురోజుకు పెరుగుతున్నాయి. ఇప్పటికే ఈ మూవీ 717 కోట్ల రూపాయలు వసూలు చేసి.. రికార్డులు తిరగరాస్తుంది. భారతదేశంలోనే 500 కోట్ల రూపాయలు వసూలు చేయగా.. విదేశాల్లో 217 కోట్ల రూపాయలు వసూలు చేయటం విశేషం. 

సెకండ్ సండే.. అంతే మూవీ రిలీజ్ అయిన తర్వాత వచ్చే రెండో ఆదివారం రోజు యానిమల్ మూవీ కలెక్షన్స్ ఎంతో తెలుసా.. అక్షరాల 87 కోట్లు.. ఇప్పటి వరకు షారూఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ సినిమాలు చెప్పుకుంటున్న పఠాన్, జవాన్ సినిమాల వసూళ్ల కంటే ఎక్కువ ఇది. రెండో ఆదివారం పఠాన్ మూవీ 28 కోట్లు.. జవాన్ మూవీ 36 కోట్లు వసూలు చేస్తే.. యానిమల్ మూవీ మాత్రం ఏకంగా 87 కోట్ల రూపాయలు రాబట్టి.. ట్రేడ్ వర్గాలనే షాక్ కు గురి చేస్తుంది. రోజు రోజుకు యానిమల్ మూవీ వసూళ్లు పెరుగుతుండటం ఆశ్చర్యానికి గురి చేస్తుంది.

మరికొన్ని రోజుల్లోనే.. వారం పది రోజుల్లో వెయ్యి కోట్ల క్లబ్ లోకి ఎంటర్ కావటం ఖాయం అంటున్నారు సినీ వ్యాపారులు.  రణ్ బీర్ కపూర్ సినిమాల్లోనే ఇది బ్లాక్ బస్టర్.. రాబోయే పది రోజుల వరకు కొత్త సినిమాలు లేవు. నెక్ట్స్ ప్రభాస్ సలార్, షారూఖ్ దున్కీ క్రిస్మస్ కు రానున్నాయి. అప్పటి వరకు యానిమల్ మూవీ కలెక్షన్స్ ఊపు తగ్గకపోవచ్చు అంటున్నాయి ధియేటర్లు..