
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ తనతో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిన ఓ అభిమాని ఫోన్ ను విసిరేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఓ అభిమాని రణ్ బీర్ తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించిండు. రణ్ బీర్ కూడా నవ్వూతూ అభిమానితో సెల్ఫీకి ఫోజు ఇచ్చిండు. అయితే ఆ అభిమాని చాలా సార్లు సెల్ఫీకి ప్రయత్నించిండు. దీంతో చిరాకు పడ్డ రణ్ బీర్ అతని ఫోన్ తీసుకుని వెనక్కి విసిరేసిండు. ఈ వీడియోను తన ఇన్ స్టాగ్రామ్ లో పోస్టు చేసిన బాలీవుడ్ ఫోటోగ్రాఫర్ వైరల్ భయానీ ‘షాకింగ్ రణబీర్ కపూర్ అభిమాని ఫోన్ విసిరేశాడు అని క్యాప్షన్ ఇచ్చాడు. 16 సెకన్లు ఉన్న ఈ వీడియో క్షణాల్లోనే వైరల్ అయ్యింది.