విజిలెన్స్ విచారణ జరుగుతుండగా.. ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా

విజిలెన్స్  విచారణ జరుగుతుండగా.. ఆర్అండ్బీ ఈఎన్సీ గణపతి రెడ్డి రాజీనామా

తెలంగాణ రోడ్లు భవనాల శాఖ ఇంజినీరింగ్ ఇన్ చీఫ్ ఐ. గణపతి రెడ్డి రాజీనామా చేశారు. వ్యక్తిగత కారణాలతో తన పదవికి రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. రాజీనామాను ప్రిన్సిపల్ సెక్రటరీకి పంపారు. గణపతి రెడ్డి  గత పదేళ్ళుగా  ఆర్అండ్ బీ ఈ ఎన్సీగా పనిచేశారు. 

కొత్త సెక్రటేరియట్ నిర్మాణంలో కీలకంగా వ్యవహరించారు గణపతి రెడ్డి. అమర వీరుల స్థూపం, అంబేద్కర్ విగ్రహం, కొత్త కలెక్టరేట్ల నిర్మాణంలో కీ రోల్ పోషించారు. ఇష్టానుసారంగా అంచనాలు పెంచారని గణపతిరెడ్డిపై ఆరోపణలు ఉన్నాయి.  టిమ్స్ తో పాటు వరంగల్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ బడ్జెట్  పెంపుపై ఆరోపణలు వచ్చాయి. దీనిపై ఇప్పటికే విజిలెన్స్ విచారణకు ఆదేశించింది రేవంత్ సర్కార్.