కూకట్పల్లి, వెలుగు: ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా సోమవారం జేఎన్టీయూలో ‘జలం, లింగ సమానత్వం’ అనే అంశంపై సదస్సు జరిగింది. దీనికి హైడ్రా కమిషనర్రంగనాథ్చీఫ్గెస్ట్గా హాజరై మాట్లాడారు. అర్బనైజేషన్వేగంగా జరుగుతుండడంతో భూ వనరులపై ఒత్తిడి పెరిగి చెరువులు, కుంటలు కాలుష్యం బారిన పడ్డాయన్నారు.
తాము చేస్తున్న ప్రయత్నానికి ప్రజల సహకారం కావాలన్నారు. గౌరవ అతిథిగా టి. కిషన్కుమార్రెడ్డి హాజరై మాట్లాడుతూ జల రక్షణ, లింగ సమానత్వం అనే అంశాలు నేటి పరిస్థితులకు అవసరమైన ముఖ్యాంశాలన్నారు. మహిళల సాధికారత కోసం వారిని ప్రోత్సహించవలసిన అవసరం ఉందన్నారు. జి గ్రూప్హెడ్డాక్టర్ పి.మంజుశ్రీ జల వనరుల నిర్వహణ కోసం ఏఐ ఆధారిత భూ పరిశీలన అనే అంశంపై మాట్లాడారు. యూసీఈఎస్టీహెచ్ప్రిన్సిపాల్డాక్టర్ జి.వి.నరసింహారెడ్డి, ప్రొఫెసర్ వి.హిమబిందు, డాక్టర్ కె.మృత్యుజయరెడ్డి, డాక్టర్ టి.విజయలక్ష్మి పాల్గొన్నారు.
