బంగారం కోసం .. అత్తను చంపిన కోడలు..కామారెడ్డి జిల్లాలో దారుణం

బంగారం కోసం .. అత్తను చంపిన కోడలు..కామారెడ్డి జిల్లాలో దారుణం
  •  రంగారెడ్డి జిల్లాలో భోజనం విషయంలో గొడవ, వ్యక్తి హత్య

లింగంపేట, వెలుగు : ఓ మహిళ బంగారం కోసం తన అత్తను బండరాయితో కొట్టి హత్య చేసింది. ఈ ఘటన కామారెడ్డి జిల్లా గాంధారి మండలం సీతాయిపల్లిలో శనివారం రాత్రి జరిగింది. ఎస్సై ఆంజనేయులు తెలిపిన వివరాల ప్రకారం... సీతాయిపల్లి గ్రామానికి చెందిన రావటి రుక్మవ్వ (73)కు ముగ్గురు కుమారులు.

ఇద్దరు కొడుకులు చనిపోగా, చిన్న కుమారుడు భార్యాపిల్లలతో కలిసి హైదరాబాద్‌‌‌‌లో ఉంటున్నాడు. డబ్బుల విషయంలో రుక్మవ్వకు రెండో కోడలు కోటవ్వకు తరచూ గొడవలు జరిగేవి. ఈ క్రమంలో రుక్మవ్వను చంపితే డబ్బులతో పాటు బంగారు నగలు తీసుకోవచ్చని కోటవ్వ ప్లాన్‌‌‌‌ చేసింది.

ఈ క్రమంలో శనివారం రాత్రి ఇంట్లో పడుకున్న అత్త రుక్మవ్వ తలపై బండరాయితో కొట్టడంతో ఆమె అక్కడికక్కడే చనిపోయింది. అనంతరం రుక్మవ్వ ఒంటిపై ఉన్న బంగారు నగలను తీసుకొని తనకేమీ తెలియనట్లు వెళ్లిపోయింది. అనుమానం వచ్చిన బంధువులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు కోటవ్వను అదుపులోకి తీసుకున్నారు. 

రంగారెడ్డి జిల్లాలో...

గండిపేట, వెలుగు : భోజనం విషయంలో గొడవ జరగడంతో ఓ వ్యక్తి కత్తితో మరో యువకుడిని హత్య చేశాడు. ఈ ఘటన రంగారెడ్డి జిల్లా నార్సింగి పీఎస్‌‌‌‌ పరిధిలో జరిగింది.  కోకాపేటలోని నార్త్‌‌‌‌ స్టార్‌‌‌‌ అల్లూరా విల్లాస్‌‌‌‌లో ఉంటున్న ధర్మతేజ వద్ద కర్నూల్‌‌‌‌ జిల్లా ఆళ్లగడ్డకు చెందిన షేక్‌‌‌‌బాషా వంటవాడిగా పనిచేస్తున్నాడు. పీనుమళ్ల కార్తీక్‌‌‌‌(35) అనే వ్యక్తి 15 రోజుల కింద అక్కడే డ్రైవర్‌‌‌‌గా చేరాడు. శనివారం రాత్రి భోజనం విషయంలో షేక్‌‌‌‌ బాషా, కార్తీక్‌‌‌‌ మధ్య గొడవ జరిగింది. ఆగ్రహానికి గురైన షేక్‌‌‌‌ బాషా కత్తితో కార్తీక్‌‌‌‌పై దాడి చేశాడు. తీవ్రంగా గాయపడ్డ కార్తీక్‌‌‌‌ అక్కడికక్కడే చనిపోయాడు.