V6 News

బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన ఓటర్... ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు

బ్యాలెట్ పత్రాన్ని చింపేసిన ఓటర్... ప్రిసైడింగ్ అధికారి పోలీసులకు ఫిర్యాదు

శంషాబాద్, వెలుగు: రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం పెద్ద షాపూర్ తండా 7వ వార్డ్ పోలింగ్ సెంటర్(17/7)కు ఓటేసేందుకు ముడావత్ సత్యనారాయణ వెళ్లాడు. తాను ఓటు వేసే అభ్యర్థికి కాకుండా వేరే అభ్యర్థికి వేశానని బ్యాలెట్ పత్రాన్ని చింపేశాడు. దీంతో ప్రొసీడింగ్ అధికారి రాజశేఖర్ రెడ్డి పోలీసులకు కంప్లయింట్ చేశాడు. సత్యనారాయణనను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు.