కేంద్రం నిధులతోనే అభివృద్ధి, సంక్షేమ పనులు : రాణిరుద్రమ 

కేంద్రం నిధులతోనే అభివృద్ధి, సంక్షేమ పనులు : రాణిరుద్రమ 
  •     బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాణిరుద్రమ 

సుల్తానాబాద్, వెలుగు: కేంద్ర ప్రభుత్వ నిధులతోనే రాష్ట్రంలో అభివృద్ధి, సంక్షేమ పథకాలు అమలువుతున్నాయని బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, సుల్తానాబాద్ ఎన్నికల ఇన్‌‌‌‌చార్జి రాణిరుద్రమ అన్నారు. సోమవారం పట్టణంలోని పార్టీ ఆఫీస్‌‌‌‌లో పార్టీ ముఖ్య నాయకులు, కౌన్సిలర్ అభ్యర్థులతో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే సుల్తానాబాద్ పేరును సుగ్గల్దేవ్‌‌‌‌పల్లిగా మారుస్తామన్నారు.

 టికెట్లు రాని ఆశావహులకు ఇతర అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇచ్చారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కర్రె  సంజీవరెడ్డి, జిల్లా ఎన్నికల ఇన్‌‌‌‌చార్జి రాజమౌళి గౌడ్, మనోహర్ రెడ్డి, అర్జున్ రావు, మహేందర్ యాదవ్, అశోక్ రావు, కందుల శ్రీనివాస్, తదితరులు పాల్గొన్నారు.