కళ్యాణి (వెస్ట్ బెంగాల్): ఆల్‌రౌండ్ షోతో ఆకట్టుకున్న బెంగాల్.. రంజీ ట్రోఫీలో సెమీఫైనల్ బెర్త్‌ను ఖాయం చేసుకుంది. మంగళవారం ముగిసిన క్వార్టర్‌ఫైనల్లో బెంగాల్ ఇన్నింగ్స్ 90 రన్స్ తేడాతో ఆంధ్రపై విజయం సాధించింది. 64/3 ఓవర్‌నైట్ స్కోరుతో ఐదో రోజు ఆట కొనసాగించిన ఆంధ్ర రెండో ఇన్నింగ్స్‌లో 72.2 ఓవర్లలో 244 రన్స్‌కే ఆలౌటైంది.
నితీశ్ కుమార్ రెడ్డి (90), త్రిపురణ విజయ్ (45) ఎనిమిదో వికెట్‌కు 85 రన్స్ జోడించినా ప్రయోజనం దక్కలేదు. కెప్టెన్ రికీ భుయ్ (30), కలిదిండి రాజు (25) కాసేపు పోరాడారు. కేవీ సతీశ్ (0), సౌరభ్ కుమార్ (1) నిరాశపర్చారు. ఇంజ్యురీ కారణంగా వికెట్ కీపర్ కేఎస్ భరత్ బ్యాటింగ్‌కు దిగలేదు.
షెహబాజ్ అహ్మద్ 4 వికెట్లతో ఆంధ్ర ఇన్నింగ్స్‌ను కట్టడి చేయగా.. సూరజ్ సింధు జైస్వాల్ 2, ఆకాశ్ దీప్, సుమంత్ గుప్తా, అనుస్తుప్ మజుందార్ తలా ఓ వికెట్‌తో అండగా నిలిచారు. సుదీప్ కుమార్ ఘరానీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది. ఆదివారం నుంచి జరిగే సెమీస్‌లో బెంగాల్.. జమ్మూ కశ్మీర్‌తో, ఉత్తరాఖండ్.. కర్నాటకతో తలపడతాయి.
