
మాజీ కలెక్టర్‌పై రేప్ కేసు నమోదయిన ఘటన చత్తీస్‌గఢ్‌లో చోటుచేసుకుంది. జంజ్‌గిర్-చంపా జిల్లా మాజీ కలెక్టర్ తనపై అత్యాచారం చేశాడంటూ ఓ మహిళ కేసు పెట్టింది. జంజ్‌గిర్-చంపా జిల్లా కలెక్టర్ జేపీ పాథక్ తనపై ఆయన ఆఫీసులోనే మే15న అత్యాచారం చేశాడని సదరు మహిళ ఆరోపించింది. మహిళ ఫిర్యాదుతో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసు సూపరింటెండెంట్ పారుల్ మాథుర్ తెలిపారు. కొన్ని రోజుల క్రితం జేపీ పాథక్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్‌గా బదిలీపై వెళ్లారు. ఆయన జంజ్‌గిర్-చంపా జిల్లాలో కలెక్టర్‌గా విధులు నిర్వహించినప్పుడు ఈ ఘటన జరిగినట్లు ఆమె తెలిపారు.
‘కలెక్టర్ పై ఒక మహిళ ఈ రోజు ఫిర్యాదు చేసింది. కలెక్టర్ తనకు అశ్లీల సందేశాలను పంపించాడని మరియు ఆయన కార్యాలయంలోనే తనపై అత్యాచారం చేశాడని ఆమె ఆరోపించింది. ఆమె నుంచి పూర్తి స్టేట్‌మెంట్ తీసుకున్నాం. ఆమె దగ్గర ఉన్న ఫోన్ రికార్డులు కూడా ధృవీకరించబడ్డాయి’ అని ఎస్పీ తెలిపారు. భారతీయ శిక్షాస్మృతిలోని పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఆమె తెలిపారు.
For More News..