రేప్ అంటే చావును కోరుకున్నట్లే .. ఏడుగురికి మరణశిక్ష

రేప్ అంటే చావును కోరుకున్నట్లే .. ఏడుగురికి మరణశిక్ష

 హైదరాబాద్: రేప్ అంటే చావును కోరుకున్నట్లే.. దిశ ఘటన తర్వాత పోలీసులు చేస్తున్న ఈ హెచ్చరికలు సొల్లు మాటలనుకుంటే కొరివితో గోక్కున్నట్లే. దిశ ఘటన తర్వాత రేప్.. రేప్ అటెంప్ట్ కేసుల్లో న్యాయస్థానాలు తీవ్రంగా పరిగణిస్తున్నాయి. దీనికి తాజా నిదర్శనం రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం ఇచ్చిన సంచలన తీర్పు. మొబైల్ ఫోన్లు.. సీసీ కెమెరాలు వచ్చాక.. టెక్నాలజీ బాగా పెరగడం నేరాల నిరూపణకు బాగా ఉపయోగపడుతోంది. అత్యాచారాల కేసులు వస్తే చాలు.. చావును కోరుకున్నట్లేనంటూ పోలీసులు చేస్తున్న హెచ్చరికలు నిజమేనని న్యాయస్థానాలు తీర్పులు స్పష్టం చేస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా 8 అత్యాచారాల కేసుల్లో ఏడుగురికి మరణశిక్షలు పడ్డాయంటే తీర్పులు ఎంత కఠినంగా ఉంటున్నాయో ఎవరికైనా ఇట్టే అర్థమవుతుంది. హైదరాబాద్ శివార్లలో దిశ ఘటన తర్వాత దేశవ్యాప్త ఆందోళనల ఫలితంగా ప్రభుత్వాలు చట్టాలకు పదును పెట్టాయి. కొత్త కొత్త సెక్షన్లను.. కఠిన శిక్షలను సిఫారసు చేసిన ఫలితం ఇప్పుడిప్పుడే కనిపిస్తోంది. టెక్నాలజీ వల్ల పోలీసులు నేరస్తులను పట్టుకోవడం.. వారిపై నేరాలు రుజువు చేయడంలో వెంట వెంటనే జరిగిపోతుండడంతో కేసులు కూడా ఏళ్లతరబడి సాగే అవకాశం లేకుండా వెంటనే కొలిక్కి వస్తున్నాయి.

సాక్షాధారాలు నిరూపించడంపై ప్రత్యేక శ్రద్ధ వల్లే ఈ తీర్పులు-సీపీ సజ్జనార్

రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం సంచలనతీర్పునకు ప్రధాన కారణం సాక్షాధారాలను పకడ్బందీగా నిరూపించమేనని సైబరాబాద్ సీపీ సజ్జనార్ వెల్లడించారు. మైనర్ బాలిక హత్యాచారం కేసులో   రంగారెడ్డి జిల్లా న్యాయస్థానం సంచలన తీర్పు ఇచ్చిన అనంతరం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. అభం శుభం తెలియని ఐదేళ్ల బాలికను చాక్లెట్ ఇప్పిస్తానని తీసుకెళ్లి నిందితుడు అత్యాచారం చేయడాన్ని కోర్టు తీవ్రంగా పరిగణించి మరణ శిక్షతోపాటు వేయి రూపాయల జరిమానా ఖరారు చేసిందన్నారు. సైబరాబాద్ కమీషనరేట్ నార్సింగి పోలీస్ స్టేషన్ పరిధిలో  2017 సంవత్సరంలో ఈ దారుణం చోటు చేసుకుందని ఆయన వివరించారు. ఇంటి ముందు ఆడుకుంటున్న ఆరు సంవత్సరాల చిన్నారిని చాక్లెట్ ఇప్పిస్తానంటూ తీసుకొని వెళ్లి లైంగిక దాడి చేసి దారుణంగా హత్య చేసిన నిందితుడు దినేష్ పై చిన్నారి తల్లిదండ్రుల పిర్యాదు మేరకు…..కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టడం జరిగిందని..  నార్సింగీ పోలీసులు నిందితుడు దినేష్ ను అరెస్ట్ చేసి  రిమాండ్ తరలించడం జరిగిందని ఆయన గుర్తు చేశారు. కేసు పూర్వపరాలు పరిశీలించిన న్యాయస్థానం. నిందితుడు దినేష్ కు మరణ శిక్ష ఖరారు చేసిందని సీపీ సజ్జనార్ తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 8 మైనర్ గర్ల్ రేప్ అండ్  మర్డర్ కేసులో 7 గురికి కోర్టులు మరణశిక్ష విధించాయని ఆయన వివరించారు. సైబరాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో నార్సింగి పోలీసు స్టేషన్ లో లిమిట్ లో జరిగిన రేప్ అండ్ మర్డర్ కేసులో  మొదటి మరణశిక్ష పడిందని, నేరం జరిగితే పక్కా సాక్ష్యాధారాలను సేకరించి నిందితులకు శిక్షలు పడే విధంగా మానిటరింగ్ చేస్తున్నామని సీపీ సజ్జనార్ తెలిపారు.

ఇవి కూడా చదవండి

నార్సింగి అత్యాచార నిందితుడికి ఉరిశిక్ష

మహిళా ఎస్సై వార్నింగ్.. మంత్రి ఫోన్ చేసినా వదిలిపెట్టం

తెలంగాణలో రాజన్న రాజ్యం తీసుకొస్తా

కేసీఆర్ అండతోనే షర్మిల కొత్త పార్టీ

జగన్ వద్దన్నా షర్మిల వినలే.. ఆమె పార్టీతో వైసీపీకి సంబంధం లేదు