హైదరాబాద్, వెలుగు: రోడ్డు ప్రమాద బాధితులకు సాయపడేందుకు ప్రవేశపెట్టిన రాహ్ వీర్ స్కీమ్‌పై అవగాహన కల్పించడానికి రైడ్‌హెయిలింగ్ ప్లాట్‌ఫారమ్ రాపిడో, కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ చేతులు కలిపాయి. ఇందులో భాగంగా దేశవ్యాప్తంగా 4 లక్షల మందికి పైగా రాపిడో కెప్టెన్లు ప్లాట్‌ఫారమ్ ద్వారా రాహ్‌వీర్ ప్రతిజ్ఞ చేశారు.
ఇది గిన్నిస్ వరల్డ్ రికార్డ్‌ను సృష్టించింది. రాపిడో 400కుపైగా నగరాల్లో ఈ పథకంపై దేశవ్యాప్తంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహించనుంది. ప్రమాద సమయాల్లో బాధ్యతాయుతమైన పౌరులుగా వ్యవహరించడాన్ని ప్రోత్సహిస్తుంది.
