శ్రీనగర్: జమ్మూకాశ్మీర్ అసెంబ్లీలో ఆసక్తికర పరిణామం చోటు చేసుకుంది. అసెంబ్లీలో ప్రతిపక్ష సభ్యురాలు ప్రసంగిస్తుండగా అధికార పార్టీ సభ్యులు చప్పట్లు కొట్టారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ను విమర్శిస్తున్నప్పటికీ తొలిసారి మాట్లాడుతుండటంతో నేతలంతా కలిసి ఉత్సాహపరిచారు. జమ్మూకాశ్మీర్ బడ్జెట్ను బీజేపీ ఎమ్మెల్యే దేవయాని రాణా తీవ్రంగా విమర్శించారు.
నేషనల్ కాన్ఫరెన్స్ (ఎన్సీ) ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లోని లోపాలను ఎత్తి చూపారు. అయితే, సీఎం ఒమర్ అబ్దుల్లాకు చెందిన ఎన్సీ ఎమ్మెల్యేలతో సహా ఇతర పార్టీల సభ్యులు ఆమెను ప్రశంసించారు. దేవయాని తండ్రి దేవేందర్ సింగ్ రాణా ఎన్సీలో సుదీర్ఘకాలం పనిచేశారు. సీఎం ఒమర్ అబ్దుల్లాకు ఆయన అత్యంత సన్నిహితుడు.
