పెనుబల్లి మండలం‌‌‌‌‌‌‌‌లో అరుదైన నక్షత్ర తాబేలు స్వాధీనం

పెనుబల్లి మండలం‌‌‌‌‌‌‌‌లో  అరుదైన నక్షత్ర తాబేలు స్వాధీనం

పెనుబల్లి, వెలుగు : అరుదైన నక్షత్ర తాబేలును అటవీశాఖ అధికారులు స్వాధీనం చేసుకుని పార్క్ కు తరలించారు. వివరాల్లోకి వెళ్తే.. ఖమ్మం జిల్లా పెనుబల్లి మండలం‌‌‌‌‌‌‌‌ లంకపల్లి గొల్లగూడెం ఫారెస్ట్ బీట్ పరిధిలో వెంకటేశ్వరావు అనే రైతు తన పొలం నుంచి వస్తుండగా అరుదైన నక్షత్ర తాబేలు పొలం గట్ల పై కనపడింది. దానిని రైతు నేరుగా ఇంటికి తీసుకొచ్చి అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. 

గొల్లగూడెం ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ నరసింహారావు, బెస్ క్యాంపు కృష్ణ రైతు ఇంటికి వెళ్లి నక్షత్ర తాబేలును స్వాధీనం చేసుకున్నారు. సత్తుపల్లి నీలాద్రి అర్బన్ పార్క్ కు తరలించి కోనేరులో వదిలి పెట్టారు. అంతరించిపోతున్న జాతులలో ఈ నక్షత్ర తాబేలు ఒకటని, దీనికి అంతర్జాతీయంగా భారీ డిమాండ్ ఉందని అధికారులు తెలిపారు.