ఆరేళ్ల బాలికకు క్యాన్సర్ నుంచి విముక్తి

ఆరేళ్ల బాలికకు క్యాన్సర్ నుంచి విముక్తి

క్యాన్స‌ర్ వ్యాధితో బాధ‌ప‌డుతున్న ఆరేళ్ల బాలిక‌కు ఆరోగ్యశ్రీ పధకం ద్వారా మూల‌క‌ణ మార్పిడి చేసి ఆమె ప్రాణాల‌ను కాపాడారు మ‌ణిపాల్ హాస్ప‌ట‌ల్ డాక్ట‌ర్లు. ప్రైమరీ రిఫ్రాక్టరి హడ్కిన్ లింఫోమా వ్యాధితో బాధపడుతున్న ఆ బాలికకు విజ‌య‌వాడ‌లోని మణిపాల్ హాస్పిటల్ లో విజయవంతంగా మూలకణ మార్పిడి చికిత్స జ‌రిగింది.

రోగికి BEAM కండీషనింగ్ మరియు ఆటోలోగాస్ మూల కణ మార్పిడి చికిత్స అందించామని ఆమెకు ట్రీట్ మెంట్ చేసిన డా.మాధవ్ దంతాల అన్నారు. బాలిక‌ పూర్తిగా కోలుకుని మంచి బ్లడ్ కౌంట్ సాధించి మూడు వారాలలో హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యారని, ఆమె ఇప్పుడు అవుట్ పేషంటుగా చికిత్స తీసుకుంటున్నద‌ని చెప్పారు. హెమటో అంకాలజి, ఎముక మజ్జ మార్పిడి మరియు మెడికల్ అంకాలజి విభాగాలలో అనుభవం కలిగిన, అంతర్జాతీయ శిక్షణ పొందిన వైద్యులును కలిగి ఉండటం వలన మేము ఈ విజయం సాధించామని ఆయ‌న‌ అన్నారు.

అంతర్జాతీయ ప్రమాణాలతో , అత్యాధునిక సౌకర్యాలతో కూడిన పరికరాలు మరియు అనుభవజ్ఞులైన నిపుణులను కలిగి వుండటం వలన ఎటువంటి ఆరోగ్య సమస్యలు ఎదురైనా, సకాలంలో సరియైన చికిత్సను అందించగలుగుతున్నామ‌ని హాస్పిటల్ డైరక్టర్ డా.సుధాకర్ కంటిపూడి అన్నారు. రోగులు చికిత్స కొరకు దూర ప్రాంతాలకు వెళ్ళే అవసరం లేకుండా నాణ్యమైన ఆరోగ్య సేవలు మరియు ఆరోగ్యసంరక్షణను విజయవాడలోని మణిపాల్ హాస్పిటల్లో అందిస్తున్నామని చెప్పారు.