వైరల్ అవుతున్న రష్మిక టీ షర్ట్.. సంథింగ్.. సంథింగ్ అంటున్న నెటిజన్స్

వైరల్ అవుతున్న రష్మిక టీ షర్ట్.. సంథింగ్.. సంథింగ్ అంటున్న నెటిజన్స్

రష్మిక మందన్నా(Rashmika Mandanna).. ప్రస్తుతం ఈ పేరు ఇండియా వైడ్ గా ట్రెండ్ అవుతోంది. కారణం ఆమె నటించిన మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ యానిమల్ ఇవాళ(డిసెంబర్ 1) ప్రేక్షకుల ముందుకు వచ్చింది. బాలీవుడ్ స్టార్ హీరో రణ్బీర్ కపూర్ హీరోగా వచ్చిన ఈ సినిమా ఆడియన్స్ నుండి సూపర్ హిట్ టాక్ ను తెచ్చుకుంది. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన రష్మికకు మంచి మార్కులే పడ్డాయి. మోస్ట్ వైలెంట్ అండ్ ఎమోషనల్ రైడ్ గా వచ్చిన ఈ సినిమాకు సందీప్ రెడ్డి వంగ దర్శకత్వం వహించారు. ఇక సినిమాకు వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. బాక్సాఫీస్ దగ్గర భారీ వసూళ్లు రాబట్టే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. దీంతో మరో సూపర్ హిట్ ను తన ఖాతాలో వేసుకుంది రష్మిక.

ఇదిలా ఉంటే.. తాజాగా రష్మిక మందన్నా హైదరాబాద్ ఎయిర్పోర్ట్ లో మెరిశారు. అయితే ఆ సమయంలో ఆమె విజయ్ దేవరకొండకు సంబందించిన రౌడీ బ్రాండ్ హుడీ టీ షర్ట్ ను ధరించి కనిపించారు. దీంతో రష్మికను ఆ టీ షర్ట్ లో చూసిన నెటిజన్స్ విజయ్, రష్మిక మధ్యన సంథింగ్.. సంథింగ్ అంటూ కామెంట్స్ చేస్తున్నారు. దానికి కారణం లేకపోలేదు. కొన్నిరోజుల క్రితం విజయ్ దేవరకొండ కూడా అదే టీ షర్ట్ ధరించి కనిపించారు. ఆ ఫొటోస్ కూడా సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యాయి. దీంతో.. విజయ్ ధరించిన ఆ టీ షర్ట్ నే ఇప్పుడు రష్మిక వేసుకున్నారు అనే వార్తలు వైరల్ అవుతున్నాయి. మరి వాటిల్లో నిజమెంత అనేది తెలియాలంటే మాత్రం ఇద్దరిలో ఎవరో ఒకరు స్పందించాలి. 

ఇక రష్మిక మందన్నా చేస్తున్న సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ఆమె ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తో పుష్ప2 లో హీరోయిన్ గా నటిస్తున్నారు. సుకుమార్ దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమా వచ్చే ఏడాది ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతేకాకుండా..  రెయిన్‌ బో అనే లేడీ ఓరియెంటెడ్ మూవీ కూడా చేస్తున్నారు రష్మిక. ఈ రెండు సినిమాలతో పాటు ది గర్ల్ ఫ్రెండ్ అనే మరో సినిమాను కూడా మొదలుపెట్టారు రష్మిక. ఇటీవలే లాంఛనంగా ప్రారంభమైన ఈ సినిమాను అల్లు అరవింద్ సమర్పణలో రాహుల్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్నారు. ఈ ఈ మూడు సినిమాలు వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రానున్నాయి.