విజయ్ దేవరకొండ తన షూటింగ్ రద్దు కావడంతో ఇంట్లో కుటుంబంతో గడిపిన ఒక మధురమైన క్షణాన్ని సోషల్ మీడియాలో పంచుకున్నారు. వర్షం కారణంగా షూటింగ్ క్యాన్సల్ అవ్వడంతో, ఆయన తన తల్లిదండ్రుల మధ్య ప్రశాంతంగా నిద్రపోతున్న ఫోటోను ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
‘‘వర్షాల వల్ల షూటింగ్ క్యాన్సిల్ అయింది. అందుకే చిన్న పిల్లాడిలా మధ్యాహ్నం నిద్రపోయేందుకు ఫేవరెట్ స్పాట్ దొరికింది. 1000 శాతం రికవరీ’’ అని ఈ ఫొటోకు విజయ్ దేవరకొండ పెట్టిన క్యాప్షన్ అభిమానులను ఆకట్టుకుంది.
అయితే, ఈ ఫోటో వెనుక అసలు రహస్యం కూడా విజయ్ చెప్పుకొచ్చాడు. తన తల్లిదండ్రుల మధ్య నిద్రపోతున్న ఆ అందమైన ఫోటోను తీసింది ఎవరో కాదు, రష్మిక మందన్న అని తన శ్రీమతికి విజయ్ క్రెడిట్ ఇచ్చాడు.
విజయ్‌ను సరదాగా నిలదసిన రష్మిక..
విజయ్ దేవరకొండ పెట్టిన క్యాప్షన్కు రష్మిక మందన్న చేసిన కామెంట్ సోషల్ మీడియాలో మరింత వైరల్ అవుతోంది. ఈ ఫోటోను క్లిక్ చేసిన రష్మిక మందన్న సరదాగా స్పందిస్తూ, “ ఇంట్లో నా కళ్లు చూడొద్దనే నాకు ఈ ఫొటో క్రెడిట్ ఇచ్చావా? పోనీలే, ఇప్పటికైనా గతంలో నేను తీసిన అన్ని ఫోటోలకు కూడా క్రెడిట్ ఇస్తారా?” అంటూ రష్మిక చాలా సరదాగా సరదాగా నిలదీసింది.
ఈ క్రమంలోనే నా ఫోటోగ్రఫీ స్కిల్స్ ఎంత బాగున్నాయో అందరికీ చూపించుకోవాలి కదా!” అని కామెంట్ చేయడంతో అది వైరల్‌గా మారింది. ఈ క్యూట్ సంభాషణ చూసిన విరోష్ అభిమానులు రష్మికను "విజ్జు భార్య" అంటూ, ఫోటో తీసిన ఆమెను అభినందిస్తూ కామెంట్లు పెడుతున్నారు.
‘రణబాలి’తో విరోష్ జోడీ..
ప్రస్తుతం విజయ్–రష్మిక జంట ‘రణబాలి’ చిత్రంలో కలిసి నటిస్తోంది. పీరియడ్ డ్రామాతో తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని శ్యామ్ సింగరాయ్ డైరెక్టర్ రాహుల్ సాంకృత్యాన్ డైరెక్ట్ చేస్తున్నాడు. ఈ సినిమా కథ ఒక కల్పిత రాజ్యం నేపథ్యంలో జరిగే శక్తివంతమైన యోధుడి ప్రయాణాన్ని చూపిస్తుందని ఇండస్ట్రీ వర్గాల టాక్.
ఇందులో విజయ్ దేవరకొండ యోధుడి పాత్రలో, రష్మిక కీలకమైన పాత్రలో కనిపించనున్నారు. ప్రేమ, ప్రతీకారం, రాజ్యాధికారం కోసం జరిగే సంఘర్షణలు కథలో ప్రధాన అంశాలుగా ఉంటాయని టాక్. సెప్టెంబర్ 11న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. గతంలో విరోష్ జోడీ గీత గోవిందం, 'డియర్ కామ్రేడ్' చిత్రాల్లో కలిసి నటించి ప్రేమలో పడ్డారు.
I love you Jayamma :) pic.twitter.com/HFXUgWCaRm
— Vijay Deverakonda (@TheDeverakonda) April 5, 2026
