నాకు మద్దతుగా నిలబడినందుకు థ్యాంక్స్ : రష్మిక మందన్నా

నాకు మద్దతుగా నిలబడినందుకు థ్యాంక్స్ : రష్మిక మందన్నా

నేషనల్ క్రష్ రష్మిక మందన్నా(Rashmika mandanna) డీప్ ఫేక్ వీడియో ఒకటి సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. ఈ విషయంపై నెటిజన్స్ తో పాటు, స్టార్స్, పొలిటిషయన్స్ కూడా మండిపడుతున్నారు. ఇప్పటికే ఈ విషయంపై బిగ్ బీ అమితాబ్ బచ్చన్ (Amitabh Bachchan), ఎమ్మెల్సీ కవిత (Kavitha)  స్పందించారు. ఈ వీడియో మార్పింగ్ చేసిన వారిపై లీగల్ యాక్షన్ తీసుకోవాలని వారంతా డిమాండ్ చేశారు.

తాజాగా రష్మిక మందన్నాతన ట్విట్టర్ నుంచి..తనకు అండగా నిలిచిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలియజేసింది. ' నా కోసం అండగా నిలబడినందుకు థ్యాంక్స్ సర్. మీలాంటి గొప్ప లీడర్స్ ఉన్న ఈ దేశంలో నేను సురక్షితంగా ఉన్నానని..బిగ్ బి అమితాబ్ కి రిప్లై ఇచ్చింది. అలాగే ఎమ్మెల్సీ కవిత ట్వీట్ కు..'థ్యాంక్స్ మేడమ్..అని రీట్వీట్ చేసింది రష్మిక.  

ఇదే విషయంపై కేంద్ర మంత్రి రాజీవ్ చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. ఇండియాలో ఐటీ నిబంధనలు ఉల్లంగించే ఏ కంటెంట్ అయినా తీసేయాలని సోషల్ మీడియా ప్లాట్ ఫార్మ్స్ కు గుర్తుచేశారు. లేదంటే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు.