రాష్ట్రపతి నిలయంలో సందడి

 రాష్ట్రపతి నిలయంలో సందడి
  • బొల్లారంలోని రాష్ట్రపతి నిలయం సందడిగా మారింది. 

ఈ నెల 22 నుంచి తొమ్మిది రోజులపాటు ‘భారతీయ కళా మహోత్సవం’ జరుగుతుండగా, సందర్శకులతో ఆ ప్రాంతమంతా కిక్కిరి కనిపిస్తున్నది. దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకృతులు విశేషంగా ఆకట్టుకుంటున్నాయి. నిత్యం 6500 మంది సందర్శకులు వస్తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. సోమవారం రాజస్థాన్, మహారాష్ట్ర, గుజరాత్ సహా పలు రాష్ట్రాలకు చెందిన కళాకారుల ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. -కంటోన్మెంట్, వెలుగు