షమీని ఇంట్లో కూర్చోబెట్టడం పట్ల ఆశ్చర్యపోయా

షమీని ఇంట్లో కూర్చోబెట్టడం పట్ల ఆశ్చర్యపోయా

ఆసియాకప్లో టీమిండియా వైఫల్యంపై ఇంటా బయటా విమర్శలు చెలరేగుతున్నాయి. అభిమానులు, మాజీ క్రికెటర్లు భారత జట్టు ఆటతీరుపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. టీమిండియా వైఫల్యంపై మాజీ క్రికెటర్ రవిశాస్త్రి ఘాటుగా స్పందించాడు. ఆసియాకప్ కోసం టీమ్ ఎంపిక సరిగ్గా లేదంటూ సంచలన వ్యాఖ్యలు చేశాడు.  ఈ టీమ్ సెలక్షన్ లో మేనేజ్మెంట్ నిర్ణయాన్ని ఆయన తప్పుపట్టాడు. 

షమీని ఎందుకు పక్కనపెట్టారో అర్థం కాలేదు..

ఆసియా కప్ టోర్నీ కోసం హార్దిక్ పాండ్యాతో సహా నలుగురు పేసర్లను మాత్రమే ఎంపిక చేయడం పట్ల రవిశాస్త్రి అసంతృప్తి వ్యక్తం చేశాడు.  ఐపీఎల్ లో అద్భుతంగా రాణించడంతో పాటు.. షమీకి అనుభవం ఉందని.. అలాంటిది అతన్ని పక్కన పెట్టడం పట్ల ఆశ్యర్యపోయానని చెప్పాడు. బీసీసీ సెలక్షన్ కమిటీ ఎంపిక బాలేదని.. కేవలం నలుగురు పేసర్లనే ఎంచుకోవడం సరికాదన్నాడు. దుబాయ్ పిచ్‌లు స్పిన్‌కు అంతగా అనుకూలించవని.. అలాంటిది ఒక స్పిన్నర్ను తగ్గించి మరో ఫాస్ట్ బౌలర్ ను తీసుకుంటే బాగుండేదన్నాడు. ప్రస్తుతం ఘోర ఓటములు చవిచూసిన టీమిండియా.. ఇతర జట్ల దయ ఉంటే తప్ప..  ఫైనల్ కు చేరడం కష్టమని రవిశాస్త్రి అన్నారు. ఆసియా కప్ కోసం  భారత సెలక్షన్ కమిటీ భువనేశ్వర్, అర్హదీప్ సింగ్, అవేష్ ఖాన్, హార్దిక్ పాండ్యను పేసర్లుగా ఎంపిక చేసింది.

 

ఐపీఎల్లో సూపర్ పర్ఫామెన్స్..

మహ్మద్ షమీ చివరి సారిగా 2021లో టీ20ల్లో భారత్కు ప్రాతినిధ్యం వహించాడు.  ఇక ఐపీఎల్ 2022లో  గుజరాత్ టైటాన్స్‌ తరఫున ఆడిన షమీ అద్భుతంగా రాణించాడు.  16  మ్యాచుల్లో  24.40 సగటుతో 20 వికెట్లు పడగొట్టాడు. అయినా..షమీని ఆసియా కప్కు ఎంపిక చేయలేదు.